రెండు లక్షల మైలురాయిని దాటిన మారుతి సుజుకి రిట్జ్

మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే రిట్జ్ కూడా అతి తక్కువ సమయంలో 2 లక్షల అమ్మకాల మైలురాయిని సాధించిందని ఆయన అన్నారు. గడచిన ఆర్థిక సంవత్సరం (2011-12)లో మారుతి సుజుకి 64,000 యూనిట్ల రిట్జ్ కార్లను విక్రయించింది. ఆసియన్ మార్కెట్లలో రిట్జ్‌కు మంచి డిమాండ్ ఉంది. 2010లో రిట్జ్ ఎగుమతులను కంపెనీ ప్రారంభించింది.
ఇప్పటి వరకూ మారుతి సుజుకి మొత్తం 8,000 యూనిట్లకు పైగా రిట్జ్ కార్లను ఎగుమతి చేసింది. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్‌లో 1.2 లీటర్ కె-సిరీస్ ఇంజన్‌ను, డీజిల్ వేరియంట్‌లో 1.3లీటర్ డిడిఐఎస్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ రెండు ఇంజన్లు కూడా టెక్నాలజీ పరంగా మెరుగ్గా ఉంటటమే కాకుండా, మంచి పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటాయి.


Click it and Unblock the Notifications








