మరుగన పడిపోనున్న మారుతి 800, ఆల్టో మోడళ్లు

అయితే, ఈ రెండు మోడళ్లను తలదన్నేలా అధిక మైలేజ్‌నిచ్చే ఓ 800సీసీ కారును మారుతి సుజుకి అభివృద్ధి చేస్తోంది. మరో రెండేళ్లలో ఈ చిన్న కారు భారత రోడ్లపై పరుగులు తీయడానికి సిద్దం కానుంది. మారుతి అభివృద్ధి చేస్తున్న ఈ చిన్న కారు గురించి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ షిన్జో నకనిషి ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. "ఏదో ఒక రోజు మనం మారక తప్పదు.. వాటి (ఎమ్ 800, ఆల్టో) రీప్లేస్‌మెంట్ మోడల్ అభివృద్ధి దశలో ఉంద"ని అన్నారు.
ఈ రెండు మోడళ్లు కూడా దీర్ఘకాలంగా భారత మార్కెట్లో ఉన్నాయని, ప్రస్తుతం రోజుల అవసరాలకు అనుగణంగా వీటిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కొత్త మోడల్ కారు 800సీసీ ఇంజన్‌తో ఆకర్షనీయమైన షేప్‌ను కలిగి ఉంటుందని, అధిక మైలేజ్‌ను ఇచ్చేందుకు గానూ మారుతి సుజుకి ఇంజనీర్లు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు.
ఈ మోడల్ మార్పు కోసం రూ.550 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రస్తుత కఠిన కాలుష్య నిబంధనల కారణంగా మెట్రో నగరాల్లో మారుతి ఎమ్ 800 కారు అమ్మకాలను నిషేధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిన్న కార్ సెగ్మెంట్లో టాటా నానో, హ్యుందాయ్ ఇయాన్ వంటి మోడళ్ల రాకతో పెరుగుతున్న పోటీ కారణంగా, సదరు పోటీని తట్టుకునేందుకు ఇదే విభాగంలో సరికొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.
కాగా.. కొత్త మోడల్‌ను విడుదల చేసినప్పటికీ ఆల్టో కె10 (ఆల్టో మోడల్ 1000సీసీ వెర్షన్) అమ్మకాలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని నకనిషి తెలిపారు.


Click it and Unblock the Notifications








