గుర్గావ్ ప్లాంట్‌లో కూడా స్విఫ్ట్ డిజైర్ ఉత్పత్తి ప్రారంభం

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..! మీరు ఇప్పటికే కొత్త స్విఫ్ట్ డిజైర్ కారును బుక్ చేసుకొని ఉన్నట్లయితే, తొందర్లోనే మీ కారు డెలివరీ అయ్యే అవకాశం ఉంది. స్విఫ్ట్ డిజైర్ కార్ల పెండింగ్ ఆర్డర్ల సంఖ్య సుమారు 65,000 యూనిట్లకు మించి పోవడంతో గుర్గావ్ ప్లాంటులో కూడా ఈ మోడల్ కార్ల ఉత్పత్తి చేపట్టాలని కంపెనీ నిర్ణయించింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్లు ఇప్పటి వరకూ మానేసర్ ప్లాంటులో ఉత్పత్తి అవుతున్నాయి. గడచిన జులై నెలలో మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో జరిగిన అల్లర్ల కారణంగా కంపెనీ నెల రోజుల పాటు ప్లాంట్‌ను లాకౌట్ చేసి, ఉత్పత్తిని నిలిపివేసి సంగంతి తెలిసిందే. దీంతో మార్కెట్లో అందుబాటులో ఉన్న స్విఫ్ట్ డిజైర్ స్టాక్ మొత్తం ఖాలీ అయిపోయి, వీటి బుకింగ్‌ల సంఖ్య భారీగా పెరిగిపోయింది.

పెండింగ్ ఆర్డర్లను క్లియర్ చేయాలంటే, ఈ మోడల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, మానేసర్ ప్లాంటుతో పాటుగా గుర్గావ్ ప్లాంటులో కూడా స్విఫ్ట్ డిజైర్ కార్లను ఉత్పత్తి చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం గుర్గావ్‌ ప్లాంటులో పాత వెర్షన్ స్విఫ్ట్ డిజైర్ (టాక్సీ టూరర్)ను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. గతంలో మానేసర్ ప్లాంటులో నెలల తరబడి సమ్మె జరిగినప్పుడు కూడా స్విఫ్ట్ ఆర్డర్లను క్లియర్ చేసేందుకు గాను కంపెనీ గుర్గావ్ ప్లాంటులో ఈ మోడల్‌ను ఉత్పత్తి చేసిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Saturday, September 8, 2012, 19:15 [IST]
English summary
Good News for Swift DZire buyers. Maruti Suzuki India (MSI) has started manufacturing its much in demand Maruti Suzuki Swift DZire at the Gurgaon plant. MSI witnessed more than 65,000 booking for Swift DZire. To clear the pending orders company took this action.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+