సెలబ్రేషన్ ఎడిషన్‌ మారుతి సుజుకి ఎస్ఎక్స్4 ఫీచర్లు

దశాబ్ధాల కాలంగా దేశీయ ప్రజల ప్రయాణ/రవాణ అవసరాలను తీరుస్తూ, భారతీయుల మదిని దోచుకున్న దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) ఇటీవలే ఇండియాలో కోటి కార్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కంపెనీ అందిస్తున్న ఎస్ఎక్స్4 సెడాన్‌లో ఓ సెలబ్రేషన్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.

సెలబ్రేషన్ ఎడిషన్‌ మారుతి సుజుకి ఎస్ఎక్స్4 సెడాన్‌లో కంపెనీ అదనంగా అందిస్తున్న ఫీచర్లు:
* సరికొత్త ఫ్యాబ్రిక్ సీట్స్
* లోపలివైపు క్రోమ్ కోటింగ్ చేయబడిన డోర్ హ్యాండిల్స్
* క్రోమ్ కోటెడ్ ఏసి లోవర్స్
* ఆర్మ్ రెస్ట్స్‌పై క్యూబిక్ ప్రింటిగ్
* సెలబ్రేషన్ ఎడిషన్ ఫ్లోర్ మ్యాట్స్, పిల్లోస్‌
* సెలబ్రేషన్ ఎడిషన్‌ను గుర్తు చేసే బాడీ డెకాల్స్, గ్రాఫిక్స్

ఈనెల 9వ తేదీన మారుతి సుజుకి కోటి కార్ల ఉత్పత్తి మార్కును అధిగమించింది. ప్రస్తుతం ఎస్ఎక్స్4 సెడాన్ పెట్రోల్, డీజిల్, సిఎన్‌జీ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్‌ ఎస్ఎక్స్4లో 1.6-లీటర్ ఇంజన్‌ను ఉఫయోగించారు. ఇది 104 బిహెచ్‌పిల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే, డీజిల్ వేరియంట్‌లో 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 90 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

1983 నుండి అమ్ముడైన మారుతి సుజుకి టాప్ 5 మోడళ్లు:
1. మారుతి 800 - 26.36 లక్షల యూనిట్లు
2. ఆల్టో ఫ్యామిలీ - 19.08 లక్షల యూనిట్లు
3. ఓమ్నీ - 14.37 లక్షల యూనిట్లు
4. వ్యాగన్ఆర్ - 11.14 లక్షల యూనిట్లు
5. స్విఫ్ట్ - 6.85 లక్షల యూనిట్లు

More from DriveSpark

Article Published On: Friday, February 24, 2012, 12:48 [IST]
English summary
Maruti Suzuki has launched the SX4 Celebration Edition sedan. Company recently completed one crore sales in India and it is commemorating the event through this new Celebration Edition SX4.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+