సెలబ్రేషన్ ఎడిషన్ ఎస్ఎక్స్4‌ను ఆవిష్కరించిన మారుతి

మార్కెట్లో కోటి కార్లు అమ్మితే ఎవరైనా ఏంచేస్తారు. సంబరాలు చేసుకుంటారు. మారుతి సుజుకి కూడా అదే చేసింది. కార్లలోకెల్లా మగమహరాజుగా చెప్పుకునే మారుతి సుజుకి ఎస్ఎక్స్4 సెడాన్‌లో ఓ సరికొత్త సెలబ్రేషన్ ఎడిషన్‌ను విడుదల చేయడం ద్వారా కోటి కార్ల అమ్మకాల వేడుకలను జరుపుకుంది. భారత మార్కెటలో ఇరవై తొమ్మిదేళ్ల తమ సుధీర్ఘ ప్రయాణంలో మారుతి సుజుకి ఎన్నో మైలురాళ్లను అధిగమించింది.

తాజాగా.. ఫిబ్రవరి 9వ తేదీన కోటి కార్ల ఉత్పత్తి మార్కును అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కంపెనీ అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ ఎస్ఎక్స్4లో ఓ సెలబ్రేషన్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. సరికొత్త ఫ్యాబ్రిక్ సీట్స్, లోపలివైపు క్రోమ్ కోటింగ్ డోర్ హ్యాండిల్స్, క్రోమ్ ఏసి వెంట్స్, సరికొత్త ప్రింటెడ్ ఆర్మ్ రెస్ట్స్, సెలబ్రేషన్ ఎడిషన్ ఫ్లోర్ మ్యాట్స్, పిల్లోస్‌తో సెలబ్రేషన్ ఎడిషన్‌ను గుర్తు చేసే బాడీ పెయింటింగ్, లోగోలు కొత్త మారుతి సుజుకి ఎస్ఎక్స్4 సెడాన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.

ఇంజన్ పరంగా ఇందులో ఎలాంటి సాంకేతిక మార్పులు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం ఎస్ఎక్స్4 సెడాన్ పెట్రోల్, డీజిల్, సిఎన్‌జీ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్‌ ఎస్ఎక్స్4లో 1.6-లీటర్ ఇంజన్‌ను ఉఫయోగించారు. ఇది 104 బిహెచ్‌పిల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే, డీజిల్ వేరియంట్‌లో 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 90 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

అతి త్వరలోనే ఈ సెలబ్రేషన్ ఎడిషన్ ఎస్ఎక్స్4 మార్కెట్లో లభ్యం కానుంది. మారుతి సుజుకి సెలబ్రేషన్ ఎడిషన్ ఎస్ఎక్స్4 సెడాన్ ధర ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎస్ఎక్స్4 సెడాన్ ధర కన్నా కాస్తంత ఎక్కువగా ఉండనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 15, 2012, 14:53 [IST]
English summary
How will you celebrate the sale of one crore cars? By launching a celebration edition off course. Maruti Suzuki has just done that by unveiling the SX4 celebration Edition sedan. Maruti Suzuki recently completed one crore sales in India and it is commemorating the event through this new Celebration Edition SX4.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+