మరిన్ని డీజిల్ కార్లను ప్రవేశపెట్టనున్న మారుతి సుజుకి

Maruti Swift
కార్ల తయారీలో ప్రస్తుతం దేశపు అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి తన స్థానాన్ని అలానే పది కాలాల పాటు చల్లగా ఉంచుకునేందుకు గానూ, మార్కెట్లోకి మరిన్ని డీజిల్ వేరియంట్ కార్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ మందకొడిగా సాగుతుండటం, పెట్రోల్ కార్ల కన్నా డీజిల్ కార్లకే అధిక డిమాండ్ ఉండటం తదితర కారణల వల్ల 2011లో తమ మార్కెట్ వాటా 40 శాతానికి పడిపోయిందని, దీన్ని నిలెబెట్టుకునేందుకు మరిన్ని డీజిల్ వేరియంట్లను ప్రవేశపెట్టనున్నామని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ షింజో నకనిషి తెలిపారు.

పెట్రోల్ ధరతో పోల్చుకుంటే డీజిల్ ధర తక్కువగా ఉండటంతో కొనుగోలుదారులు డీజిల్ కార్లపైనే ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. దీంతో దాదాపు అన్ని కంపెనీలు పెట్రోల్ కార్ల ఉత్పత్తిని తగ్గించి డీజిల్ కార్ల ఉత్పత్తిపై దృష్టి సారిస్తున్నారు. గుర్గావ్‌లో ఉన్న మారుతి సుజుకి, సుజుకి మోటార్స్‌ల జాయింట్ వెంచర్ "సుజుకి పవర్ ట్రైన్" ద్వారా కంపెనీ సంవత్సరానికి 3 లక్షల డీజిల్ ఇంజన్లను ఉత్పత్తి చేయనుంది.

అంతేకాకుండా.. మూడేళ్ల పాటు ఏడాదికి 1,00,000 యూనిట్ల చొప్పున డీజిల్ ఇంజన్లను కొనుగోలు చేసేందుకు ఫియట్‌తో మారుతి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని డీజిల్ వేరియంట్ కార్లను ఉత్పత్తి చేయగలమని అంచనా వేస్తున్నామని ఆయన అన్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, February 4, 2012, 12:19 [IST]
English summary
Customer Is King and Maruti Suzuki has realized it has to satisfy customer needs if it has to maintain its position as the country's leading carmaker. It has announced plans to launch several new diesel cars considering the huge demand for such cars. Maruti Suzuki has seen its market share fall sharply in 2011 as the industry suffered a slow down and demand for Maruti Suzuki's petrol cars dipped.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+