మారుతి 800 అమ్మకాలు యధావిధిగా కొనసాగుతాయ్..

భారత కార్ మార్కెట్లో ఓ విప్లవం సృష్టించిన మారుతి సుజుకి మొట్టమొదటి కారు మారుతి 800 గురించి కార్ ప్రియులకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ అవతరించిన మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) తాజాగా తమ సరికొత్త 800సీసీ ఇంజన్ కారు 'ఆల్టో 800' దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో పాత 800 కారు చరిత్రలో కలిసిపోనుందనే పుకార్లు వచ్చాయి. అయితే, అవన్నీ ఇప్పుడు కేవలం పుకార్లుగానే మిగిలిపోనున్నాయి.

ఎందుకంటే.. తమ పాపులర్ మారుతి 800 కారు ఉత్పత్తిని నిలిపివేయబోమని, అది యధానిధిగానే మార్కెట్లో కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుత ఆధునిక కాలుష్య నిబంధనల దృష్ట్యా మారుతి 800 కారు విక్రయాలను కొన్ని ప్రధాన మెట్రో నగరాల్లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్లలో మాత్రం వీటి అమ్మకాలు బాగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు అత్యంత చేరువైన ఈ చిన్న కారును మార్కెట్ నుంచి ఉపసంహరించబోమని కంపెనీ పేర్కొంది.

మారుతి 800

ప్రస్తుతం మారుతి 800 ప్రతినెలా సగటున 1500 యూనిట్ల చొప్పున అమ్ముడుపోతుంది.

మారుతి 800

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మారుతి 800 కారులో 796సీసీ, 3-సిలిండర్, 4-స్ట్రోక్ సైకిల్, వాటర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5000 ఆర్‌పిఎమ్ వద్ద 37 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 2500 ఆర్‌పిఎమ్ వద్ద 59 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి 800

మారుతి 800 కారు పెట్రోల్, ఎల్‌పిజి ఫ్యూయెల్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఇది కేవలం బిఎస్3 కాలుష్య నిబంధనలను మాత్రమే పాటిస్తుంది.

మారుతి 800

మారుతి 800 కారులో నలుగురు ప్రయాణికులు హాయిగా ప్రయాణించవచ్చు. చిన్న కుటుంబాలు, మధ్య తరగతి కుటుంబాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సిటీల్లో నివసించే వారికి ఇది చక్కటి ఆప్షన్‌గా నిలుస్తుంది.

మారుతి 800

మారుతి 800 ధరలు:

* మారుతి 800 ఎమ్‌పిఐ బిఎస్3 ఏసి (నాన్-మెటాలిక్) - రూ. 2.38 లక్షలు

* మారుతి 800 ఎమ్‌పిఐ బిఎస్3 ఏసి (మెటాలిక్) - రూ. 2.40 లక్షలు

* మారుతి 800 ఎమ్‌పిఐ బిఎస్3 స్టాండర్డ్ (నాన్-మెటాలిక్) - రూ. 2.15 లక్షలు

* మారుతి 800 ఎమ్‌పిఐ బిఎస్3 స్టాండర్డ్ (మెటాలిక్) - రూ. 2.17 లక్షలు

(అన్ని మోడళ్లు ఇమ్మొబిలైజర్‌తో పాటుగా లభిస్తాయి, అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)


ప్రస్తుతం సగటున ప్రతి నెలా సుమారు 1,500 యూనిట్ల చొప్పున అమ్ముడవుతున్న మారుతి 800 కారు విక్రయాలు ఇదివరకటిలానే కొనసాగుతాయని కొత్త ఆల్టో 800 కారును మార్కెట్లోకి విడుదల చేసి సందర్భంగా మారుతి సుజుకి ఇండియా ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పారీక్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 1000సీసీ ఇంజన్‌తో కూడిన ఆల్టో కె10 అమ్మకాలు కూడా యధావిధిగానే ఉంటాయని ఆయన చెప్పారు. ఇది పాత ఆల్టో 800కు అప్‌గ్రేడెడ్ వెర్షన్ కాదని, దీనిని సరికొత్త ఫ్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేశామని పారీక్ వివరించారు.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మారుతి 800 కారులో 796సీసీ, 3-సిలిండర్, 4-స్ట్రోక్ సైకిల్, వాటర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5000 ఆర్‌పిఎమ్ వద్ద 37 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 2500 ఆర్‌పిఎమ్ వద్ద 59 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పెట్రోల్ మరియు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎల్‌పిజి కిట్‌తో డ్యూయెల్ పవర్ ఆప్షన్‌తో కూడా లభ్యమవుతుంది. ఈ రెండు వెర్షన్లు కూడా 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి. మారుతి 800 కారు కేవలం బిఎస్3 కాలుష్య నిబంధనలను మాత్రమే పాటిస్తుంది.

మారుతి 800 ధరలు:

  • మారుతి 800 ఎమ్‌పిఐ బిఎస్3 ఏసి (నాన్-మెటాలిక్) - రూ. 2.38 లక్షలు
  • మారుతి 800 ఎమ్‌పిఐ బిఎస్3 ఏసి (మెటాలిక్) - రూ. 2.40 లక్షలు
  • మారుతి 800 ఎమ్‌పిఐ బిఎస్3 స్టాండర్డ్ (నాన్-మెటాలిక్) - రూ. 2.15 లక్షలు
  • మారుతి 800 ఎమ్‌పిఐ బిఎస్3 స్టాండర్డ్ (మెటాలిక్) - రూ. 2.17 లక్షలు

(అన్ని మోడళ్లు ఇమ్మొబిలైజర్‌తో పాటుగా లభిస్తాయి, అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Wednesday, October 17, 2012, 11:49 [IST]
English summary
Maruti Suzuki India Chief Operating Officer (Marketing and Sales) Mayank Pareek said that, the company will not discontinue the old Maruti 800 and it will continue to sell this model to those areas where it can be sold.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+