ఆల్టో ఉత్పత్తి ఆపివేసే ప్రసక్తే లేదు...: మారుతి సుజుకి

మారుతి సుజుకి ఇండియాకు దశాబ్ధాల కాలంగా లక్కీ ఛార్మ్‌గా నిలిచిన ఆల్టో కారు ఉత్పత్తిని పూర్తిగా నిలిపి వేసే ప్రసక్తే లేదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, మారుతున్న ఆటోమొబైల్ మార్కెట్లో మారుతున్న వినియోగదారుల అభిరుచికి, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేయడం, డిజైన్‌లను మార్పు చేయడం, మోడళ్లను రెన్యువల్ చేయడం వంటి తరచూ జరుగుతూనే ఉంటాయని కంపెనీ మేనేజింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఐవి రావు అన్నారు.

మారుతి సుజుకి అత్యంత ప్రజాదరణ తెచ్చిపెట్టిన ఆల్టో బ్రాండ్‌ను ప్రజలకు దూరం చేయబోమని, వచ్చే సంవత్సరంలో ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ ఆల్టో కారును ప్రజల ముందుకు తీసుకురానున్నామని కంపెనీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే, కంపెనీ మొట్టమొదట మార్కెట్లోకి విడుదల చేసిన ఎమ్800 కారు ఉత్పత్తిని కూడా నిలిపివేయలేదని, బిఎస్4 (భారత్ స్టేజ్ 4) కాలుష్య నిబంధనలు పాటించే కొన్ని ప్రధాన మెట్రో నగరాల్లో మాత్రమే వీటి అమ్మకాలను నిలిపివేశామని ఆయన అన్నారు.

మారుతి ఆల్టో ఒక్క భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా మాత్రమే కాకుండా, ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో సైతం స్థానం దక్కించుకుంది. భారత మార్కెట్లో సంవత్సరానికి మూడు లక్షలకు పైగా ఆల్టో కార్లు అమ్ముడవుతున్నాయి. గడచిన సంవత్సరంలో కంపెనీ 3.1 లక్షల ఆల్టో కార్లను విక్రయించింది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 7, 2012, 11:42 [IST]
English summary
Maruti Suzuki India has denied reports that it is planning to end the commercial production of either the iconic Maruti 800 or its best selling model - Alto. Both models have been pivotal in providing Maruti Suzuki its Number 1 position and it will soon provide upgrades to the two models rather than completely stopping them.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+