గుర్గావ్‌లో డీజిల్ ఇంజన్ ప్లాంటును ఏర్పాటు చేయనున్న మారుతి

Maruti Diesel Engine
దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ)కు డీజిల్ ఇంజన్ కష్టాలు త్వరలోనే తొలగిపోనున్నాయి. డీజిల్ ఇంజన్ల లభ్యత కొరత కారణంగా అవస్థలు పడుతున్న మారుతి సుజుకి ఇకపై తామే స్వయంగా డీజిల్ ఇంజన్లను తయారు చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గుర్గావ్‌లో ఓ కొత్త డీజిల్ ఇంజన్ ప్లాంటును ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి సాలీనా 1.5 లక్షల డీజిల్ ఇంజన్లను తయారు చేసే ప్లాంటును ఏర్పాటు చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం డీజిల్ కార్లకు పెరిగుతున్న డిమాండుకు అనుగుణంగా ఉత్పత్తులను అందించేందుకు ఇది సహకరించనుంది. డీజిల్ ఇంజన్ల సరఫరా కోసం మారుతి సుజుకి, ఇప్పటికే ఫియట్ కంపెనీతో ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

ఈ ప్లాంటు గనుక ప్రారంభమైతే, మారుతి సుజుకి ఇండియాకు ఇది భారత్‌లో తొలి స్వంత డీజిల్ ఇంజన్ ప్లాంటు కానుంది, ఈ ప్లాంటు కోసం కంపెనీ సుమారు రూ.1000 కోట్ల రూపాయల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు సమాచారం. ఈ ప్లాంటు పూర్తిగా అమల్లోకి వచ్చినట్లయితే, మారుతి సుజుకి డీజిల్ కార్ల వెయిటింగ్ పీరియడ్ భారీగా తగ్గిపోవడం ఖాయం..!!

More from DriveSpark

Article Published On: Wednesday, January 25, 2012, 17:53 [IST]
English summary
Maruti Suzuki India is planning to set up its first own diesel engine plant in India. This new plant is expected to be ready by the second half of next fiscal.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+