ఈ ఏడాది చివరి నాటికి రానున్న మెర్సిడెస్ చవక కార్లు
భారత లగ్జరీ కార్ మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో చవక కార్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఒకప్పుడు ఇండియన్ లగ్జరీ కార్ మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఇప్పుడు తృతీయన స్థానానికి పడిపోయింది. ఇందుకు ప్రధాన కారణం సమీప పోటీదారులైన ఆడి ఇండియా, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా కంపెనీల నుంచి పోటీ పెరుగుతుండటమే.
ఆడి, బిఎమ్‌డబ్ల్యూ కంపెనీలు ఇప్పటికే ఇండియాలో తక్కువ ధర కలిగిన కార్లను విడుదల చేయటం అవి మంచి భారీ సక్సెస్‌ను సాధించటంతో మార్కెట్లో ఈ రెండు కంపెనీలు అగ్రస్థానాలుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా గ్లోబల్ మార్కెట్లో అందిస్తున్న తక్కువ ధరల కలిగిన కార్లను వీలైనంత త్వరా భారత మార్కెట్లో ప్రవేశపెట్టి తన మార్కెట్ వాటాను నిలబెట్టుకోవాలని ప్రయోత్నిస్తోంది. ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ కార్లు సి-క్లాస్ నుండి ప్రారంభమవుతాయి.
అయితే, సి-క్లాస్‌కు దిగువన రూ.25 లక్షల కన్నా తక్కువ ధర కలిగి ఉండే బి-క్లాస్ కార్లను భారత మార్కెట్‌కు తీసుకు రావాలని మెర్సిడెస్ బెంజ్ ఇండియా భావిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లోగా బి-క్లాస్ కార్లను మార్కెట్లో ప్రవేశపెడతామని మెర్సిడిస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో పీటర్ హానెగ్ కొత్త సి-క్లాస్ ఏఎమ్‌జి వెర్షన్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా తెలిపారు. అలాగే, రానున్న రెండేళ్లలో ఏ-క్లాస్ కార్లను, 2015-16 నాటికి తమ పూర్తి శ్రేణి మోడళ్లను భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన వివరించారు.
ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత చవక లగ్జరీ కారును బిఎమ్‌డబ్ల్యూ అందిస్తోంది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అందిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌యూవీ రూ.22 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అలాగే, ఆడి ఇటీవలే విడుదల చేసిన కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీ ఆడి క్యూ3 కూడా రూ.26 లక్షల ధర నుండి ప్రారంభమవుతుంది. ఈ పోటీ ధరల వాతావరణాన్ని తట్టుకోవాలంటే మెర్సిడెస్ బెంజ్ ఇండియా కూడా తప్పనిసరిగా చౌక ధర కలిగిన లగ్జరీ కార్లను ఇండియాకు పరిచయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.


Click it and Unblock the Notifications








