బడ్జెట్ 2012-13: బెంజ్ కార్ల ధర రూ.3 లక్షల మేర పెంపు

యూనియన్ బడ్జెట్‌లో కార్ మేకర్ల నడ్డి విరుస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాలకు తెరలేపిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని అమాంతం పెంచేయడంతో, కార్ల తయారీ కంపెనీలు ఆ భారాన్ని తాము మోయలేమంటూ తక్షణమే ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సై అంటున్నాయి. ఈ నేపథ్యంలో జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ తమ ఉత్పత్తుల ధరలను రూ.3 లక్షల మేర పెంచుతున్నామని పేర్కొంది.

ఈ బడ్జెట్ తమను ఎంతగానో నిరుత్సాహ పరిచిందని, ఈసారైనా పెద్ద వాహనాలపై సుంఖాలు తగ్గుతాయనుకుంటే, అదికాస్తా మరింత పెరిగిందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా డైరెక్టర్ (కార్పోరేట్ అఫైర్స్, హెచ్ఆర్) సుహార్ కద్లాస్కర్ పిటిఐతో తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా కస్టమర్లపై అధనపు భారాన్ని మోపాల్సి వస్తుందని, ఇది సగటును రూ.2 లక్షల నుండి రూ.3 లక్షల రేంజ్‌లో ఉంటుదని ఆయన అన్నారు.

మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న వాహనాల్లో దాదాపు అన్ని పెద్దవే (నాలుగు మీటర్ల కన్నా పొడవైన, శక్తివంతమైన ఇంజన్ కలిగిన కార్లు). అంతేకాకుండా.. మెర్సిడెస్ బెంజ్ కొన్ని రకాల మోడళ్లను పూర్తిగా విదేశాల్లో తయారైన వాటిని సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకుని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తుంది. ప్రస్తుత బడ్జెట్‌లో కస్టమ్ డ్యూటీని 60 శాతం నుండి 75 శాతానికి పెంచడంతో ఇంపోర్డెడ్ కార్ల ధరలు కూడా పెరగనున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, March 16, 2012, 18:39 [IST]
English summary
Mercedes Benz India today said it will hike its product prices by up to Rs 3 lakh expressing disappointment over high duties imposed in the Budget.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+