మంచి భవిష్యత్తు కోసం బెంజ్ నుంచి భారీ పెట్టుబడులు

దశాబ్ధాలుగా భారత లగ్జరీ కార్ మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగిన జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, ఇప్పుడు మళ్లీ మొదటి స్థానంపై కన్నేసి, ఆ దిశగా పరుగులు పెడుతోంది. ఈ సెగ్మెంట్లో పోటీని తట్టుకునేందుకు మెర్సిడెస్ బెంజ్ భవిష్యత్తులో మరిన్ని మోడళ్లను విడుదలతో చేయటంతో పాటు వివిధ అభివృద్ధి పనులను కూడా చేపట్టనుంది.

రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.850 కోట్ల నిధులను కేటాయించామని, అక్టోబర్‌ 2012 లోపు మహారాష్ట్రలోని ఛాక్కన్‌లో ఏర్పాటు చేసిన కొత్త పెయింట్‌ షాప్‌లో పనులు ప్రారంభమవుతాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పీటర్‌ టి హోనెగ్‌ తెలిపారు. భారత్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలు జోరుగా సాగుతన్నాయని, భవిష్యత్తులోను ఈ ట్రెండ్ ఇలానే కొనసాగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఛాక్కన్‌లో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌లో సి క్లాస్, ఈ క్లాస్, ఎస్ క్లాస్ కార్లను కంపెనీ అసెంబ్లింగ్ చేస్తోంది. ఉత్పత్తుల ధరలను అందుబాటులో ఉంచేందుకు గాను రానున్న రోజుల్లో మరిన్ని మోడళ్లను ఇక్కడ అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.

ప్రస్తుతం దేశీయ విపణిలో తక్కువ ధర కలిగిన కాంపాక్ట్ లగ్జరీ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా తాజాగా బి-క్లాస్ హ్యాచ్‌బ్యాక్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ దీపావళి నాటికి బుల్లి మెర్సిడెస్ బెంజ్ కారు ఇండియన్ మార్కెట్లో హల్ చల్ చేయనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 6, 2012, 12:39 [IST]
English summary
Mercedes-Benz India further increase its investment to Rs 850 crores by 2014. Overall committed investment in its facility in Chakan increases to Rs 850 crores. The new Paint shop to be operational by October, 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+