సిటీ బస్‌ను విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ ఇండియా
అయితే, ఇప్పుడు తాజాగా.. వోల్వో ఇండియా అందిస్తున్న సిటి బస్సులను సవాల్ చేస్తూ మెర్సిడెస్ బెంజ్ ఇండియా సిటీ బస్సులను ప్రవేశపెట్టింది. ఇంట్రా-సిటీ బస్ సెగ్మెంట్లో మెర్సిడెస్ బెంజ్ సిటీ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ అందిస్తున్న ఈ 37-సీటర్ లో-ఎంట్రీ బస్సు ప్రారంభ ధర రూ.90 లక్షలు (ఎక్స్-ఫ్యాక్టరీ, పూణే)గా ఉన్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది.
ఈ సిటీ బస్సులో 7200 సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 252 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. పూర్తి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌తో ఈ సిటీ బస్సు లభిస్తుంది. ఈ బస్సుకు గేర్లు మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇది ఆటోమేటిక్ సస్పెన్షన్‌తో లభిస్తుంది కాబట్టి. ఇంకా ఇందులో ఎయిర్ సస్పెన్షన్, డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లతో లభిస్తుంది. ఇండియాలో ఏడు ప్రధాన నగరాల్లో కంపెనీ ఈ సిటీ బస్సును గడచిన సంవత్సర కాలంగా పరీక్షించింది.


Click it and Unblock the Notifications









