భారత్‌లో పెరిగుతున్న మెర్సిడెస్ బెంజ్ కార్ల వినియోగం

ఇండియాలో బెంజ్ బాబులు అధికమైపోతున్నారు. విలాసవంతమైన కార్ల మార్కెట్లో పోటీ పెరిగి, వాటి ధరలు దిగివస్తుండటంతో పాటు కొన్ని వర్గాలకు చెందిన ప్రజల తలసరి ఆదాయం కూడా వృద్ధి చెందుతుండటంతో భారత మార్కెట్లో లగ్జరీ కార్ల వ్యాపారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇండియా, దేశీయ విపణిలో ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.

ఇండియన్ మార్కెట్లో మరింత తక్కువ ధరకే ఉత్పత్తులను అందించేందుకు గానూ మెర్సిడెస్ బెంజ్ జిఎల్ క్లాస్, బి క్లాస్, ఏ క్లాస్ వంటి మోడళ్లను దేశీయ విపణిలోనే అసెంబ్లింగ్ చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లో అందిన్న ఉత్పత్తులలో ఎక్కువ భాగం సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొంటున్నవే. మెర్సిడెస్ బెంజ్‌కు ఛాక్కన్‌లో ఉన్న ప్లాంటులో సి క్లాస్, ఈ క్లాస్, ఎస్ క్లాస్ మోడళ్లను కంపెనీ అసెంబ్లింగ్ చేస్తుంది.


పూర్తిగా విదేశాల్లో తయారైన కార్లను ఇండియాకు దిగుమతి చేసుకుంటే వాటిపై 110 శాతం దిగుమతి సుంఖాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అదే, ఆ కార్లను విడిభాగాలుగా, దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబ్లింగ్ చేసినట్లయితే, దిగుమతి సుంఖం దాదాపు 30 శాతం వరకూ తగ్గుతుంది. ఫలితంగా ఇండియాలో తక్కువ ధరకే కార్లను ఆఫర్ చేసేందుకు మెర్సిడెస్ బెంజ్‌కు అవకాశం ఏర్పడుతుంది. వ్యాపారణ విస్తరణ కోసం రూ.350 పెట్టుబడులను వెచ్చిస్తామని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 16, 2012, 15:52 [IST]
English summary
Mercedes-Benz plans to assemble models like GL class, B Class, A class to regain market share in India. "We are going to change the rules of the game in the next three years with our CKD lines," said Peter Honegg, MD & CEO of Mercedes Benz India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+