ప్రణబ్ ముఖర్జీ కోసం రూ.6 కోట్ల ఖరీదు చేసే లగ్జరీ కారు

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉపయోగించేటువంటి అత్యంత శక్తివంతమైన, సురక్షితమైన మరియు అధునాతమైన పొడవాటి కారును మనదేశ అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో గెలిచిన ప్రణబ్ ముఖర్జీకి కూడా భారత ప్రభుత్వం ఆఫర్ చేసింది. గడచిన సంవత్సరంలో భారత ప్రభుత్వం ఇది వరకు అధ్యక్ష పదవిలో పనిచేసిన ప్రతిభా పాటిల్ కోసం 'మెర్సిడెస్ బెంజ్ ఎస్600ఎల్ పుల్‌మ్యాన్ గార్డ్' అనే లగ్జరీ సెలూన్ కారును ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆమె స్థానంలో వచ్చిన ప్రణబ్ ముఖర్జీకి ఈ మెర్సిడెస్ బెంజ్ ఎస్600ఎల్ పుల్‌మ్యాన్ గార్డ్ కారును అధ్యక్ష వాహనంగా భారత సర్కారు అందజేసింది. ఇకపై అధికారిక పర్యటనల నిమిత్తం ప్రణబ్ ముఖర్జీ ఎక్కడికి వెళ్లినా ఈ కారులోనే ప్రయాణిస్తారు. అయితే, ఇది బరాక్ ఒబామా ఉపయోగిస్తున్నటువంటి 'ది బీస్ట్' అంతటి అధునాతనమైన కారు కాకపోయినప్పటికీ, అన్ని ఆయుధాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో కారు లోపలి వ్యక్తులను పరిరక్షించేలా దీన్ని రూపొందించారు. దీని ఖరీదు సుమారు ఆరు కోట్ల రూపాయలు.


ఈ అధ్యక్ష లీమోజైన్‌ను దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత అప్‌గ్రేడ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే, ఈ విషయంపై స్పందించేందుకు ఇటు రాష్ట్రపతి భవన్ కానీ, అటు మెర్సిడెస్ బెంజ్ అధికారులు కానీ నిరాకరించారు. ఈ ఏడాది మధ్య భాగంలో ప్రెసిడెంట్ కోసం ఈ కారును కొనుగోలు చేశారని, దీన్ని పూర్తి సాయుధ సామాగ్రితో ప్రత్యేక రక్షణ వాహనంగా తీర్చిదిద్దేందుకు ఒక ఏడాది సమయం పట్టిందని ప్రభుత్వ వర్గాల సమాచారం.

అత్యంత విశాలమైన ఇంటీరియర్స్ కలిగిన ఈ కారులో శక్తివతంమైన 5513సీసీ 12-సిలిండర్ బై-టర్బో ఇంజన్‌ను అమర్చారు, ఇది 517 హార్స్ పవర్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ప్రమాదకర పరిస్థితులు, అత్యవసర సమయాల్లో ఈ కారు శక్తివంతగా పరుగులు తీస్తుంది. 2010లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పో మెర్సిడెస్ బెంజ్ 'ఎస్600ఎల్ పుల్‌మ్యాన్' కారును ప్రదర్శించింది.

More from DriveSpark

Article Published On: Monday, July 23, 2012, 11:26 [IST]
English summary
President designate Pranab Mukharjee will use Mercedes Benz S600 Pullman Guard luxury saloon. This fully armored car is worth Rs.6 crores and can protect the president from grenade and poison gas attacks.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+