సరసమైన ధరకే మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ విడుదల

లగ్జరీ స్మాల్ కార్ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి తెరలేపుతూ.. జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ చిన్న కారు 'బి-క్లాస్' పరదాలను తొలగించింది. ఇటు కంపెనీ అటు లగ్జరీ కార్ ప్రియులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ కారు నేడు మార్కెట్లో విడుదలయ్యింది. భారత కార్ మార్కెట్లో 'స్పోర్ట్స్ టూరర్' అనే విభాగాన్ని సృష్టిస్తూ కంపెనీ ఈ కారును విడుదల చేసింది.

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ రెండు వేరియంట్లలో (బి 180, బి180 స్పోర్ట్) లభ్యమవుతుంది. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ రెండు బి 180 - రూ.21.49 లక్షలు
* మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ రెండు బి180 స్పోర్ట్ - రూ.24.87 లక్షలు


ఇది ఎమ్‌యూవీ (మల్టీ యుటిలిటీ వెహిలక్) లాంటి సౌకర్యాన్ని, సెడాన్ లాంటి రైడ్ క్వాలిటీని, ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) లాంటి పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఉపయోగించిన 1.6 లీటర్ (1595సీసీ) 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 122 హెచ్‌పిల శక్తిని, 1250-4000 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త బి-క్లాస్ 10.2 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా 190 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ప్రస్తుతానికి ఇది కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతోంది. బి-క్లాస్ కోసం ఇప్పటికే ఈ ఏడాదికి సరిపడా బుకింగ్‌లను (250 యూనిట్లు) కంపెనీ సొంతం చేసుకుంది. కొత్తగా వచ్చే బుకింగ్‌లు జనవరి 2013లో డెలివరీలు చేస్తామని కంపెనీ పేర్కొంది.

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్‌ స్పోర్ట్ టూరర్‌ను కంపెనీ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్)తో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. ఇప్పట్లో ఈ కారును సికెడి (కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్) రూట్లో విడిభాగాలను దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో అసెంబ్లింగ్ చేసే యోచన లేదని కంపెనీ పేర్కొంది. తక్కువ ధరలో విలాసవంతమైన, సురక్షితమైన ఫీచర్లను కోరుకునే వారికి బి-క్లాస్ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 18, 2012, 15:21 [IST]
English summary
Mercedes-Benz India has launched its new B-Class Sports Tourer with a price tag of Rs.21.49 lakhs. This will mean the new B-Class is the German premium carmaker's cheapest car in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+