విడుదలైన 6 రోజుల్లో 100 బుకింగ్‌లు దక్కించుకున్న మినీ
ఈ సందర్భంగా కూపర్, కంట్రీమ్యాన్, కన్వెర్టిబిల్ అనే మూడు ఉత్పత్తులు మినీ విడుదల చేసింది. ఈ కార్ల డెలివరీలు ఏప్రిల్ 2012 నుండి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో 200 మినీ కార్లను విక్రయించాలని కంపెనీ యోచిస్తోండగా, అందులో ఇప్పటికే 100 యూనిట్లకు ఆర్డర్లు రావడం విశేషం.
ఈ బుకింగ్‌లలో ఎక్కువగా కంట్రీమ్యాన్ ఎస్‌యూవీ, కన్వర్టిబల్ వేరియంట్లే ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఈ మోడళ్లను దిగమతి చేసుకొని దేశీయ మార్కెట్లో విక్రయించడం జరుగుతోంది. ఇప్పటికే భారత మార్కెట్లో ఉన్న ఇలాంటి చిన్నసైజు ప్రీమియం కార్లతో పోల్చుకుంటే బిఎమ్‌డబ్ల్యూ మినీ బ్రాండ్ విడుదలైన వారం రోజుల్లోనే విజయవంతమైందని చెప్పవచ్చు.
గడచిన సంవత్సరంలో ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న ప్రీమియం కారు "బీటెల్" (దాదాపు రూ.21 లక్షలు) 59 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అలాగే గడచిన ఆర్థిక సంవత్సరంలో ఫియట్ అందిస్తున్న 'ఫియట్ 500' (దాదాపు రూ.16 లక్షలు) ఒక్క కారు మాత్రమే అమ్ముడుకావడంతో దీని అమ్మకాలను కంపెనీ నిలిపివేసింది.
మినీ మోడళ్లు - ధరలు:
దేశీయ మార్కెట్లో మినీ అందిస్తున్న మోడళ్లు, ధరల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
* మినీ కూపర్ - రూ.24,90,000/-
* మినీ కూపర్ ఎస్ - రూ.27,90,000/-
* మినీ కూపర్ కన్వర్టిబల్ - రూ.29,99,000/-
* మినీ కూపర్ ఎస్ కంట్రీమ్యాన్ - రూ.31,99,000/-
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications









