ఇండియాలో రెండవ షోరూమ్‌ను ప్రారంభించిన మినీ
లగ్జరీ కార్ మేకర్ బిఎమ్‌డబ్ల్యూకు చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ 'మినీ' భారత్‌లో రెండవ షోరూమ్‌ను దేశ రాజధానిలో ప్రారంభించింది. గడచిన జనవరిలో ఢిల్లీలో జరిగిన 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో బిఎమ్‌డబ్ల్యూ తమ మినీ కార్ బ్రాండ్‌ను ఇండియాలోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం మినీ కార్ల కోసం ప్రత్యేకంగా ఓ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను ఢిల్లీలోని వసంత్ కుంజ్ ఏరియాలో ప్రారంభించింది.
కాగా.. మినీ గడచిన ఏప్రిల్ నెలలో తమ మొట్టమొదటి షోరూమ్‌ను భారత వాణిజ్య రాజధాని ముంబైలో ఏర్పాటు చేసి, నాలుగు మోడళ్లను దేశీయ విపణిలో విడుదల చేసింది. లగ్జరీ కార్లను దిగుమతి చేసుకుని భారత మార్కెట్లో విక్రయించే ప్రముఖ డీలర్ ఇన్ఫినిటీ కార్స్ బిఎమ్‌డబ్ల్యూ మినీ బ్రాండ్‌కు ముంబైలో అధీకృత డీలర్‌గా వ్యవహరిస్తుండగా, న్యూఢిల్లీలో బర్డ్ ఆటోమోటివ్ అధీకృత డీలర్‌గా వ్యవహరించనుంది.
ముంబైలో సుమారు 12,500 చ.అ. విస్తీర్ణంలో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ షోరూమ్‌లో ఓ రెస్టారెంట్ సౌకర్యం కూడా ఉంది. మినీ బ్రాండ్‌కు ఇండియా 100వ మార్కెట్ కావటం మరో విశేషం. దేశవ్యాప్తంగా ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 5-6 మినీ డీలర్‌షిప్ కేంద్రాలను ప్రారంభిస్తామని, ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరు, ఛండీగడ్‌లలో వీటిని ఏర్పాటు చేయనున్నామని బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు ఆండ్రియాస్ స్కాఫ్ తెలిపారు.
ఢిల్లీలో ఏర్పాటైన మినీ రెండవ షోరూమ్ 5,000 చ.అ. విస్తీర్ణంతో, రెండు అంతస్థులను కలిగి ఉంది. ఈ షోరూమ్‌లో మినీ కూపర్ (రూ.25.5 లక్షలు), మినీ కూపర్ ఎస్ (రూ.28.6 లక్షలు), మినీ కన్వర్టిబల్ (రూ.30.7 లక్షలు), మినీ కంట్రీమ్యాన్ (రూ.32.8 లక్షలు) వాహనాలను బిఎమ్‌డబ్ల్యూ విక్రయించనుంది.
కాగా.. ముంబైలో ఏర్పాటు చేసిన మొదటి షోరూమ్ 12,500 చ.అ. విస్తీర్ణాన్ని కలిగి ఉండి, ఇందులో ఓ రెస్టారెంట్ సౌకర్యం కూడా ఉంది. మినీ బ్రాండ్‌కు ఇండియా నూరవ మార్కెట్ కావటం విశేషం. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 5-6 మినీ డీలర్‌షిప్ కేంద్రాలను ప్రారంభించాలని బిఎమ్‌డబ్య్లూ భావిస్తోంది. ఢిల్లీ తర్వాత హైదరాబాద్, బెంగుళూరు, ఛండీగడ్‌లలో మినీ తమ షోరూమ్‌లను ఏర్పాటు చేయనుంది. బిఎమ్‌డబ్ల్యూ మినీ బ్రాండ్ కార్లను సిబియూ రూట్లో (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) దిగుమతి చేసుకుని దేశీయ విపణిలో విక్రయిస్తుంది.


Click it and Unblock the Notifications








