యూఎస్‌లో 90 వేలకు పైగా బిఎమ్‌డబ్ల్యూ మినీ కార్ల రీకాల్

రీకాల్ చేసిన మోడళ్లలో మినీ కూపర్ ఎస్, కూపర్ ఎస్ క్లబ్‌మ్యాన్, కూపర్ ఎస్ కన్వర్టిబల్‌లు ఉన్నాయి. 2006వ సంవత్సరం నుండి 2011వ సంవత్సర మధ్య కాలంలో తయారైన మోడళ్లు ఈ రీకాల్‌కు వర్తించనున్నాయి. అయితే, ఈ లోపం కారణంగా ఇప్పటి వరకూ ఎలాంటి మేజర్ ప్రమాదాలు సంభవించినట్లు నమోదు కాలేదని, ముందస్తు సురక్షిత చర్యగా ఈ రీకాల్ చేస్తున్నామని మినీ ఓ ప్రకటనలో పేర్కొంది.
గడచిన 2009వ సంవత్సరం నుండి ఇప్పటి వరకూ మినీ 81 వాటర్ పంప్ ఫెయిల్యూర్ కేసులను, నాలుగు ఇంజన్ ఫైర్ కేసులను అందుకుంది. వచ్చే నెల నుండి ఈ కార్లను పరిశీలించనున్నట్లు మినీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








