భారత్‌లో పాజెరో స్పోర్ట్‌ను విడుదల చేసిన మిత్సుబిషి
మిత్సుబిషి పాజెరో స్పోర్ట్‌లో 2.5 లీటర్, 16-వాల్వ్, టర్బోచార్జ్‌డ్ ఇంటర్‌కూల్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 4000 ఆర్‌పిఎమ్ వద్ద 178 పిఎస్‌ల శక్తిని, 2000-2500 ఆర్‌పిఎమ్ వద్ద 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ సిస్టమ్‌తో పాటుగా ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది.
ధర విషయంలో ఇది ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్లోని టొయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్, చెవర్లే కాప్టివా, హ్యందాయ్ శాంటాఫే, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 వంటి ఎస్‌యూవీలతో పోటీ పడనుంది. కలకత్తాకు చెందిన హిందుస్థాన్ మోటార్స్‌తో కలిసి మిత్సుబిషి భారత్‌లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
లాన్సర్, సెడియా, అవుట్‌లాండర్ మోడళ్లను కూడా మిత్సుబిషి దేశీయ విపణిలో విక్రయిస్తుంది. ఇవే కాకుండా.. ఇండియా మార్కెట్ కోసం ఓ చిన్న కారును (మిరేజ్) కూడా తీసుకు రావాలని మిత్సుబిషి సన్నాహాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications









