భారత్‌లో చిన్న కార్ మార్కెట్లోకి ప్రవేశించనున్న మిత్సుబిషి
ప్రస్తుతం భారత చిన్న కార్ మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సెగ్మెంట్లో ఓ సరికొత్త చిన్నకారును ప్రవేశపెట్టాలని మిత్సుబిషి భావిస్తోంది. గడచిన డిసెంబర్ నెలలో టోక్యోలో జరిగిన ఓ అంతర్జాతీయ ఆటో షోలో మిత్సుబిషి ఆవిష్కరించిన "మిరేజ్" స్మాల్ కారును ఇండియన్ మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. థాయ్‌లో ఎకో కార్‌గా చెప్పుకునే మిరేజ్ ఇండియన్ మార్కెట్‌కు రావడానికి కనీసం మరో రెండు-మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది.
వాస్తవానికి మిరేజ్ పాత బ్రాండే అయినప్పటికీ సరికొత్త లుక్‌తో కంపెనీ దీనిని విడుదల చేసింది. భారత్ చిన్న కార్ల మార్కెట్‌కు పెట్టింది పేరని భవిష్యత్తులో తాము కూడా రంగం ప్రవేశం చేస్తామని మిత్సుబుషి మోటార్ కార్పొరేషన్ జపాన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్పొరేట్ జనరల్ మేనేజర్ ఆసియా మాసాహికో యూకెయి చెప్పారు. మిరేజ్ హ్యాచ్‌బ్యాక్ తొలుతగా థాయ్‌లాండ్ మార్కెట్లో లభ్యం కానుంది.
మిత్సుబిషి గడచిన దశాబ్ధ కాలంగా భారత మార్కెట్లో అత్యంత పురాతన ఆటోమొబైల్ సంస్థ అయిన హిందుస్థాన్ మోటార్స్‌తో కలిసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ దేశీయ మార్కెట్లో పెద్దగా మార్కెట్ వాటాను దక్కించుకోలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం, కంపెనీ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో తక్కువగా ఉండి, ఉన్న మోడళ్ల ధరలు కూడా అధికంగా ఉండటమే. ఏదేమైనప్పటికీ, మిత్సుబిషి భారత మార్కెట్లో అందిస్తున్న సెడాన్ లాన్సర్ మాత్రం మంచి మార్కెట్ వాటాను సంపాధించుకుంది.
ఇవి కాకుండా, సెడియా సెడాన్, పాజెరో, మోంటెరో, అవుట్‌లాండర్ ఎస్‌యూవీలను మిత్సుబిషి దేశీయ విపణిలో అందిస్తుంది. మిత్సుబిషి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లోకి ప్రవేశిస్తే, కంపెనీ నుండి లభిస్తున్న చిన్న మరియు చౌక కారుగా ఇది నిలువనుంది. మిరేజ్ రెండు ఇంజన్ వేరియంట్లలో (1 లీటర్, 1.2 లీటర్) లభ్యమవుతుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ కలిగిన వేరియంట్ కూడా లభించే అవకాశం ఉంది. మైలేజ్‌ను పెంచేందుకోసం ఇందులో ఆటో స్టార్ట్, ఆటో స్టాప్ ఆప్షన్ కూడా ఉండనుంది.


Click it and Unblock the Notifications









