సరికొత్త అవుట్‌లాండర్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన మిత్సుబిషి

జపాన్ ఆటోమొబైల్ కంపెనీ మిత్సుబిషి మోటార్స్ కార్పోరేషన్ (ఎమ్ఎమ్‌సి) అందిస్తున్న క్రాసోవర్ 'అవుట్‌లాండర్'లో ఓ సరికొత్త తరం మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రస్తుతం లభిస్తున్న అవుట్‌లాండర్ క్రాసోవర్ కన్నా ఎన్నో మెరుగైన సరికొత్త 'నెక్స్ట్ జనరేషన్ అవుట్‌లాండర్'ను జెనీవాలో జరుగుతున్న 82వ అంతర్జాతీయ జెనీవా మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించింది.

ప్రస్తుతం మిత్సుబిషి ఆవిష్కరించి ఈ సరికొత్త క్రాసోవర్ మూడవ తరానికి చెందింది. గడచిన 2001లో తొలిసారిగా అవుట్‌లాండర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ మిడ్-సైజ్ క్రాసోవర్ ప్రీమియం వెహికల్‌గా ప్రవేశపెట్టేందుకు మిత్సుబిషి దీనిని గ్లోబల్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా డిజైన్ చేసింది. పర్యావరణంపై తక్కువ ప్రభావం, మరింత భద్రత, సౌకర్యవతంమైన డ్రైవింగ్, క్లెవర్ యుటిలిటీ, అదనపు కన్వీనెస్స్ అనే ఐదు సూత్రాలను ఆధారంగా చేసుకు మిత్సుబిషి ఈ సరికొత్త తర్వాతి తరం అవుట్‌లాండర్ క్రాసోవర్‌ను అభివృద్ధి చేసింది.

ఇది పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభ్యం కానుంది. పెట్రోల్ వేరియంట్లో సరికొత్త 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సివిటీ గేర్‌బాక్స్‌తో 2-వీల్ డ్రైవ్, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యం కానుంది. డీజిల్ వేరియంట్లో సరికొత్త 2.2 లీటర్ డిఐడి క్లీన్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 2-వీల్ డ్రైవ్, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 8, 2012, 12:30 [IST]
English summary
Eleven years after it first coined the term "crossover", Mitsubishi Motors Corporation (MMC) today unveils its third embodiment of this concept with the all-new next generation Outlander at the 82nd International Geneva Motor Show.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+