గల్ఫ్ ఆయిల్ ప్రచారకర్తగా మహేంద్ర సింగ్ ధోనీ

Dhoni
భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి కొత్త డీల్ దొరికింది. ధోనీతో లండన్‌కు చెందిన ప్రముఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ 'గల్ఫ్ ఆయిల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్' ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని హిందుజా గ్రూప్‌ పేర్కొంది (భారత్‌లోని హిందూజా గ్రూప్ ద్వారా గల్ఫ్ ఆయిల్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

ఈ డీల్‌లో భాగంగా, గల్ఫ్ ఆయిల్ ఉత్పత్తులకు మహేంద్ర సింగ్ ధోనీ ప్రచారకర్త (బ్రాండ్ అంబాసిడర్)గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత ఐపిఎల్‌ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని 'సిగ్నేచర్‌ ఎమ్ఎస్‌డి ప్యాక్స్‌' పేరిట పరిమిత సంఖ్యలో స్పెషల్‌ ఎడిషన్‌ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని సంస్థ చైర్మన్‌ సంజయ్‌ హిందుజా వెల్లడించారు.

ఇదిలా ఉండగా, భారతీయులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో దక్షిణ భారతదేశంలో ఓ లూబ్రికేషన్ ప్లాంటును ఏర్పాటు చేయాలని గల్ఫ్ ఆయిల్ ఇంటర్నేషల్ లిమిటెడ్ భావిస్తోంది. ఈ కొత్త ప్లాంటును తమిళనాడులో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏర్పాటు చేసే ఆస్కారం ఉంది. ఇందు కోసం కంపెనీ రూ.150 కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 2, 2012, 13:26 [IST]
English summary
Gulf Oil has appointed MS Dhoni as their brand ambassador. Gulf Oil International Limited, from the stable of the Hinduja Group, is contemplating on setting up a lubricant plant in south India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+