మరిన్ని వేరియంట్లలో టాటా నానో కారు: రతన్ టాటా

ప్రపంచంలో కెల్లా అత్యంత చీప్ (చవక) కారుగా ముద్రగా వేసుకున్న టాటా నానో కారులో మరిన్ని వేరియంట్లను విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటి వరకూ కేవలం పెట్రోలే వేరియంట్లో మాత్రమే లభిస్తున్న టాటా నానోలో డీజిల్ వేరియంట్‌ను, ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయనున్న టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా తెలిపారు.

జెనీవాలో జరుగుతున్న 82 జెనీవా మోటార్ షోలో టాటా మోటార్స్ అభివృద్ధి మెగాపిక్సెల్ హైబ్రిడ్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించిన అనంతరం రతన్ టాటా మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. గడచిన జనవరిలో ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ తమ బుజ్జి కారు నానోలో ఓ సిఎన్‌జి వేరియంట్‌ను మరొక కాన్సెప్ట్ కారును ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా.. ఇటీవల రతన్ టాటా ఓ సందర్భంలో నానో కారు గురించి మాట్లాడుతూ.. నానో కారులో మరింత శక్తివంతమైన ఇంజన్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని కూడా అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 2012 వెర్షన్ టాటా నానో కారులో 624సీసీ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.40 లక్షల నుండి రూ.1.50 లక్షల రేంజ్‌లో ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 7, 2012, 19:15 [IST]
English summary
Tata Group Chairman Ratan Tata said, company is planning to bring more variants including diesel and electric version in their small car Tata Nano. Tata Motors has presented its all-new concept car 'Megapixel' at the 82nd Geneva Motor Show in Geneva.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+