టాటా మోటార్స్ అమ్మకాలు పెరిగటంలో తోడ్పడి నానో
ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు:
జులై 2012లో టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు జులై 2011తో పోల్చుకుంటే 53 శాతం వృద్ధి చెంది 26,240 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఇవి 17,192 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ అందిస్తున్న చిన్న కారు టాటా నానో అమ్మకాలు ఏకంగా 68 శాతం వృద్ధిని సాధించి 3,260 యూనిట్ల నుంచి 5,485 యూనిట్లకు పెరిగాయి.
ఇండికా రేంజ్ కార్ల అమ్మకాలు 51 శాతం మేర వృద్ధిని సాధించి 5,860 యూనిట్ల నుంచి 8,852 యూనిట్లకు పెరగగా, ఇండిగో రేంజ్ కార్ల అమ్మకాలు 40 శాతం మేర వృద్ధిని సాధించి 4,877 యూనిట్ల నుంచి 6,816 యూనిట్లకు పెరిగాయి. సుమో, సఫారీ, ఆరియా, వెంచర్ రేంజ్ అమ్మకాలు 59 శాతం మేర వృద్ధిని సాధించి 3,195 యూనిట్ల నుంచి 5,087 యూనిట్లకు పెరిగాయి. ఎప్పటిలాగే, ఇండియాలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ల అమ్మకాలు కూడా జోరుగానే సాగాయి.
ఎగుమతులు:
ఇకపోతే, కంపెనీ ఎగుమతుల విషయానికి వస్తే.. జులై 2012లో టాటా మోటార్స్ ఎగుమతులు గతేడాది సమయంతో పోల్చుకుంటే 15 శాతం క్షీణించి 6,512 యూనిట్ల నుంచి 5,532 యూనిట్లకు పడిపోయాయి.


Click it and Unblock the Notifications









