నెథర్లాండ్స్‌కి టాటా నానో కారు ఎలా వెళ్లిందో తెల్సా..?

టాటా మోటార్స్ బుజ్జి కారు టాటా నానో నెథర్లాండ్ రోడ్లపై ర్యాంప్ వాక్ చేస్తోంది. అసలు నానోకు నెథర్లాండ్స్‌లో ఏం పని అనుకుంటున్నారా..? నానో కారంటే ఇండియన్లకు పెద్దగా ఇష్టం లేకపోవచ్చేమో కానీ గ్లోబల్ మార్కెట్లో ఈ చవక కారుకు మంచి అభిమానులే ఉన్నారు. నెథర్లాండ్స్‌కు చెందిన ఇలాంటి ఓ నానో అభిమాని ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి మరీ ఇండియా నుండి ఈ కారును నెథర్లాండ్స్‌కు దిగుమతి చేయించున్నాడు.

ఆన్-లైన్ ద్వారా ఆటోమొబైల్ విడిభాగాలను విక్రయించే, Blijdatikrij.nl అనే వెబ్‌సైట్ యజమాని టాటా నానో కారును నెథర్లాండ్స్‌కు దిగమతి చేయించుకొని రిజిస్టర్ చేయించాడు. దీంతో నెథర్లాండ్స్‌లో టైర్లు మోపిన మొట్టమొదటి నానో కారుగా ఈ కారు నిలించింది. అంతేకాదు.. నెథర్లాండ్స్ ఎవరికైనా నానో కారు కావాలనిపిస్తే, తానే స్వయంగా ఆర్డర్ మీద దిగుమతి చేయిస్తానని కూడా సదరు వెబ్‌సైట్ యజమాని తన వెబ్‌సైట్‌లో ప్రచారం చేస్తున్నాడు.


ప్రస్తుతం టాటా మోటార్స్ కేవలం శ్రీలంక, నేపాల్ మార్కెట్లకు మాత్రమే టాటా నానో కారును అధికారికంగా ఎగుమతి చేస్తుంది. యూరప్ మార్కెట్ కోసం నానో ప్రత్యేకంగా, అక్కడి వాతావరణ, కాలుష్య, భధ్రతా నిబంధనలకు సరిపోయే విధంగా మరొక వెర్షన్‌ను ఇప్పటికే అభివృద్ధి చేసింది. అయితే, ఇందులో ప్రొడక్షన్ వెర్షన్‌ను మాత్రం కంపెనీ ఇంకా మార్కెట్లోకి విడుదల చేయలేదు.

ఈ నానో కారును కొనుగోలు చేయటానికి Blijdatikrij 2400 యూరోలను వెచ్చించగా, రవాణా కోసం 625 యూరోలను, ఆ దేశపు పరిస్థితులకు అనుకూలంగా సరిపోయేలా మార్చేందుకు గానూ మరో 600 యూరోలను (మొత్తం 3625 యూరోలు, మన దేశ కరెన్సీలో సుమారు రూ.2.51 లక్షలు) చెల్లిచాడు. Blijdatikrij మోడిఫై చేసిన తన నానో కారులో రోడ్డుపై వెళ్తుంటే, నెథర్లాండ్స్ వాసులంతా ఆశ్చర్యంతో నానోపై నుండి దృష్టి మరల్చటం లేదట. దీన్ని బట్టి చూస్తుంటే, నానో గ్లోబల్ మార్కెట్లో కూడా భారీగానే అభిమానులను సొంతం చేసుకునేటట్లు కనిపిస్తోంది. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Monday, May 7, 2012, 13:19 [IST]
English summary
You can see a Tata Nano in Netherlands even before its launch in the country. In fact, Tata has not yet started selling its world cheapest car in Europe. Then what's the story behind this?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+