కొత్త 2012 ఏ-స్టార్‌తో అయినా మారుతి స్టార్ తిరుగుతుందా..?

మొత్తానికి ఈ విషయాన్ని గ్రహించిన మారుతి సుజుకి, కొత్త 2012 ఏ-స్టార్ హ్యాచ్‌బ్యాక్ సీటింగ్ డిజైన్‌ను మార్పు చేసి మరింత సౌకర్యంగా, ఆకర్షనీయంగా తీర్చిదిద్దింది. బీజ్ ఇంటీరియర్స్, రీడిజైన్డ్ హెడ్‌రెస్ట్స్, 60-40 నిష్పత్తిలో మడుచుకునేందుకు వీలుగా డిజైన్ చేసిన వెనుక సీట్ వంటి కాస్మోటిక్ మార్పులను చేసింది. ఇందులో అమర్చిన కొత్త సీట్లు దుమ్ము, ధూళితో కూడుకున్న మన భారతీయ రోడ్లకు ఏ మాత్రం సరిపోవు. వీటికి కొత్తగా సీట్ కవర్లను చేయించుకోక తప్పదు.
ఏ-స్టార్‌లో కొత్త వెర్షన్‌తో పాటుగా జెడ్ఎక్స్ఐ అనే కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌ను మారుతి సుజుకి పరిచయం చేసింది. 2012 ఏ-స్టార్, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఏ-స్టార్ కారు ధర కన్నా సుమారు రూ.1,000 అదనంగా ఉంటుంది.
ఐదు వేరియంట్లలో లభించే మారుతి సుజుకి ఏ-స్టార్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* ఏ-స్టార్ ఎల్ఎక్స్ఐ ధర రూ.3.66 లక్షలు
* ఏ-స్టార్ విఎక్స్ఐ ధర రూ.3.97 లక్షలు
* ఏ-స్టార్ విఎక్స్ఐ ఆటోమేటిక్ ధర రూ.4.47 లక్షలు
* ఏ-స్టార్ జెడ్‌ఎక్స్ఐ ధర రూ.4.22 లక్షలు
* ఏ-స్టార్ జెడ్‌ఎక్స్ఐ విత్ ఎబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్ ధర రూ.4.40 లక్షలు
(అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
ఈ నెల 27 నుండి 2012 ఏ-స్టార్ మోడల్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ సరికొత్త రిఫ్రెష్డ్ వెర్షన్ ఏ-స్టార్‌ను వినియోగదారుల నుండి అందిన్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, సరికొత్త హంగులను జోడించి రూపొందించామని కంపెనీ చీఫ్ జనరల్ మేనేజర్(మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. మారుతి సుజుకి ఇప్పటి వరకూ మొత్తం 3.81 లక్షల ఏ-స్టార్ కార్లను విక్రయించింది. భారత మార్కెట్లో ఏ-స్టార్ పెద్దగా సక్సెస్ కాలేదు కానీ, గ్లోబల్ మార్కెట్లో ఈ మోడల్ విజయవంతంగా దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ 130కు పైగా దేశాలలో, సుమారు 2.81 లక్షల యూనిట్లకు పైగా ఏ-స్టార్ మోడళ్లను కంపెనీ ఎగుమతి చేసింది.


Click it and Unblock the Notifications








