కొత్త ఆల్టో 800కు 21,000 యూనిట్లకు పైగా బుకింగ్స్

By Ravi

ఓ ఐడియా మీ జీవితాన్ని మార్చేసిందన్నట్లుగా, ఓ చిన్న కారు మారుతి సుజుకి స్టార్‌ని మార్చేసింది. దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) తాజాగా దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టిన సరికొత్త ఆల్టో 800 బుకింగ్‌ల పరంగా రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తూ పోతుంది. ఇది మార్కెట్లోకి విడుదలైన కొద్ది రోజుల్లోనే 21 వేల యూనిట్లకు పైగా బుకింగ్‌లను సొంతం చేసుకుంది. అస్సలు కొత్త ఆల్టో 800 మార్కెట్లోకి విడుదల కాకమునుపే దీని డిజైన్ ఎలా ఉంటుందో, ధర ఎంత ఉంటుందో తెలుసుకోకుండానే సుమారు 10,000 మందికి పైగా కొనుగోలుదారులు ఈ బుజ్జి కారును బుక్ చేసుకున్నారంటే మార్కెట్లో దీనికున్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది.

దీనికితోడు ప్రస్తుతం మార్కెట్లో పండుగ సెంటిమెంట్ బలంగా ఉండటంతో ఈ బుకింగ్‌ల సంఖ్య మరింత పెరిగింది. ఈ కారును విడుదల చేసిన వారం రోజుల్లోనే 21,200 బుకింగ్‌లు వచ్చాయని మారుతి సుజుకి ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పారీక్ తెలిపారు. ఆల్టో 800 కారుకు ఈ ఏడాది బుకింగ్‌లు ప్రోత్సాహకరంగా ఉన్నాయని, గడచిన సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే, ఈ ఏడాది బుకింగ్స్ 15 శాతం పెరిగాయని ఆయన చెప్పారు.


మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరతో విడుదల చేసిన కొత్త ఆల్టో 800 కారుకు గ్రామీణ, పట్టణ మార్కెట్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మార్కెట్లలో కంపెనీ ఇప్పటి వరకూ సుమారు 7,000 ఆల్టో 800 కార్లను విక్రయించింది. గ్రామీణ మార్కెట్లలోని వినియోగదారులను ఆకట్టుకునేందుకు 50 మెగా క్యాంప్‌లను నిర్వహించామని పారీక్ తెలిపారు.

కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కారులో రీడిజైన్డ్ ఎఫ్8డి 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. కొత్త ఆల్టో పెట్రోల్, సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ ఆల్టో 800 లీటరుకు 22.74 కి.మీ. మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ ఆల్టో 800 కేజీకి 30.46 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో ఫ్రోస్ట్ బ్లూ, బ్లేజింగ్ రెడ్, టార్క్ బ్లూ, గ్రానైట్ గ్రే, సిల్కీ సిల్వర్, సుపీరియర్ వైట్ లభిస్తుంది. ఫ్రోస్ట్ బ్లూ, గ్రానైట్ గ్రే కలర్స్ కేవలం ఎల్ఎక్స్ఐ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Thursday, October 25, 2012, 16:15 [IST]
English summary
Country's largest carmaker Maruti Suzuki India's new Alto 800, which has touched 21,200 bookings within a week of launch, Maruti Suzuki India is looking to cash in on the ongoing festive season sales.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+