అప్పుడే 500 బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ కార్ల అమ్మకం: సచిన్ ఎఫెక్టేనా?

జర్మనీకు చెంది లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా గత నెల చివరి వారంలో మార్కెట్లోకి విడుదల చేసిన సరికొత్త అప్‌గ్రేడెడ్ లగ్జరీ సెలూన్ 'బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్'కు మార్కెట్లో అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ మోడల్ మార్కెట్లోకి విడుదలయ్యి వారం రోజులు కూడా కాకముందే 500 యూనిట్లకు పైగా అమ్ముడుపోయి, లగ్జరీ కార్ మార్కెట్లో కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ కారు కోసం పత్రికలు, టెలివిజన్లు, హోర్డింగ్‌లు, ఆన్‌లైన్ మీడియాల ద్వారా కంపెనీ ప్రచారం చేసింది. ఈ కారును క్రికెట్ క్రీడా దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఆవిష్కరించబడటం కూడా దీని సక్సెస్‌కు మరొక ప్రధానం కారణంగా చెప్పుకోవచ్చు. ఈ గురించి సచిన్ ఇచ్చిన వివరణ కూడా అద్భుతంగా ఉంది. మొత్తమ్మీద చూస్తే, 2012 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ విడుదలైన కొద్ది రోజుల్లో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ విషయానికి వస్తే, ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఇది మొత్తం ఐదు వేరియంట్లలో (1 పెట్రోల్, 4 డీజిల్) లభ్యమవుతుంది. ఈ సెగ్మెంట్లోని ఆడి ఏ4 సెడాన్, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మోడళ్లకు ఇది గట్టి పోటీగా నిలువనుంది. డీజిల్ వెర్షన్ 3 సిరీస్‌ (320డి)లో ఉపయోగించిన 4-సిలిండర్ ట్విన్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 184 బిహెచ్‌పిల శక్తిని, 380 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ లీటర్ డీజిల్‌కు 18.88 కి.మీ. మైలేజీనిస్తుంది.

అలాగే, పెట్రోల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ (328ఐ)లో ఉపయోగించిన ట్విన్ పవర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 245 బిహెచ్‌పిల శక్తిని, 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.1 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 250 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. పెట్రోల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ పెట్రో‌ల్‌కు 14.79 కి.మీ. మైలేజీనిస్తుంది.

దేశీయ విపణిలో లభ్యమవుతున్న 2012 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

* బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్‌: (డీజిల్) 320డి - రూ. 28.90 లక్షలు
* బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్‌: (డీజిల్) 320డి స్పోర్ట్ లైన్ - రూ. 31.50 లక్షలు
* బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్‌: (డీజిల్) 320డి లగ్జరీ లైన్- రూ. 31.50 లక్షలు
* బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్‌: (డీజిల్) 320డి లగ్జరీ ప్లస్ - రూ. 36.90 లక్షలు
* బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్‌: (పెట్రోల్) 328ఐ స్పోర్ట్ లైన్ - రూ. 37.90 లక్షలు

More from DriveSpark

Article Published On: Thursday, August 2, 2012, 19:28 [IST]
English summary
The new BMW 3-Series gets more than 500 units bookings within the few days of its launch. 2012 BMW 3-Series has been unveiled by Indian cricket great Sachin Tendulkar. The new 3-series is priced between Rs.28.90 lakhs and Rs.37.90 lakhs. The sixth generation BMW 3-series will be built as a CKD in Chennai and Deliveries are expected to begin this mont itself.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+