ఇండోర్‌లో కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించిన జేఎల్ఆర్

కాగా.. ఇండోర్‌లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ షోరూమ్ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ భారత్‌లో 16వ డీలర్‌షిప్. బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి కార్ల కంపెనీల రాకతో ఇండోర్ లగ్జరీ కార్ డీలర్‌షిప్ హబ్‌గా ఎదుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరిన్ని షోరూమ్‌లను ఏర్పాటు చేస్తామని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రీమియర్ కార్ డివిజన్ హెడ్ మోహిత్ సూరి తెలిపారు.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియాలో మొదటి షోరూమ్‌ను 2009లో మధ్యభాగంలో ఏర్పాటు చేసిందని, తొలుత ప్రధానంగా టైర్1 నగరాలపైనే దృష్టి సారించినప్పటికీ ప్రస్తుతం ఇతర నగరాలు, ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నామని, ఇప్పుడు తమకు దేశవ్యాప్తంగా 15 డీలర్‌షిప్ కేంద్రాలున్నాయని, ఈ కొత్త డీలర్‌షిప్ ప్రారంభంతో ఈ సంఖ్య 16కు చేరుకుందని మోహిత్ తెలిపారు.
గడచిన ఆర్థిక సంవత్సరంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియాలో మొత్తం 2289 కార్లను విక్రయించి 157 శాతం వృద్ధిని తన ఖాతాలో వేసుకుంది. ఈ షోరూమ్‌లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని మోడళ్లను అమ్మకానికి ఉంచనున్నారు.


Click it and Unblock the Notifications








