కొత్త ఆల్టో 800కు 17,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు
చిన్న కార్ మార్కెట్లో లేటెస్ట్ ట్రెండ్‌గా మారిన మారుతి సుజుకి ఆల్టో 800 ఇప్పుడు దేశీయ విపణిలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ఓవైపు పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నప్పటికీ, చిన్న కార్ ప్రియులు మాత్రం కొత్త ఆల్టో 800 కారును సొంతం చేసుకునేందుకు ఎగబడుతున్నారు. విడుదలకు ముందే డిజైన్ ఎలా ఉంటుందో, ధర ఎంత మాత్రం ఉంటుందో తెలుసుకోకుండానే సుమారు 10,000 మందికి పైగా కొనుగోలుదారులు మారుతి సుజుకి ఆల్టో 800ను బుక్ చేసుకున్నారు.
తాజా అప్‌డేట్ ప్రకారం, కొత్త ఆల్టో 800 బుకింగ్‌ల సంఖ్య దాదాపు 17,000 యూనిట్లను మించిపోయింది. ప్రస్తుతం తాజాగా మార్కెట్లోకి ప్రవేశించిన కార్ల జాబితాలో అత్యధికంగా బుకింగ్‌లను కలిగి ఉన్న కారుగా కూడా కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 రికార్డులను తరిగరాసింది. పాత ఆల్టో 800 కారుతో పోల్చుకుంటే మరింత ఆకర్షనీయమైన డిజైన్, మరింత మెరుగైన మైలేజ్, మరింత నాణ్యమైన ఇంటీరియర్స్, మరింత శక్తివంతమైన పెర్ఫామెన్స్‌లతో ఈ సెగ్మంట్లో కెల్లా ఇది ది బెస్ట్ అనిపించుకోనుంది.

కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కారులో రీడిజైన్డ్ ఎఫ్8డి 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. కొత్త ఆల్టో పెట్రోల్, సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ ఆల్టో 800 లీటరుకు 22.74 కి.మీ. మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ ఆల్టో 800 కేజీకి 30.46 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో ఫ్రోస్ట్ బ్లూ, బ్లేజింగ్ రెడ్, టార్క్ బ్లూ, గ్రానైట్ గ్రే, సిల్కీ సిల్వర్, సుపీరియర్ వైట్ లభిస్తుంది. ఫ్రోస్ట్ బ్లూ, గ్రానైట్ గ్రే కలర్స్ కేవలం ఎల్ఎక్స్ఐ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
పెట్రోల్ వెర్షన్ ఆల్టో 800 ధరలు:
- మారుతి ఆల్టో 800 స్టాండర్డ్ - 2.50 లక్షలు (మెటాలిక్) - రూ. 2.47 లక్షలు (నాన్-మెటాలిక్)
- మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ - 2.83 లక్షలు (మెటాలిక్) - రూ. 2.80 లక్షలు (నాన్-మెటాలిక్)
- మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - 3.06 లక్షలు (మెటాలిక్) - రూ. 3.03 లక్షలు (నాన్-మెటాలిక్)
- మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ (ఎయిర్‌బ్యాగ్) - 3.21 లక్షలు (మెటాలిక్) - రూ. 3.18 లక్షలు (నాన్-మెటాలిక్)
సిఎన్‌జి వెర్షన్ ఆల్టో 800 ధరలు:
- మారుతి ఆల్టో 800 స్టాండర్డ్ - 3.27 లక్షలు (మెటాలిక్) - రూ. 3.23 లక్షలు (నాన్-మెటాలిక్)
- మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ - 3.45 లక్షలు (మెటాలిక్) - రూ. 3.42 లక్షలు (నాన్-మెటాలిక్)
- మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - 3.64 లక్షలు (మెటాలిక్) - రూ. 3.61 లక్షలు (నాన్-మెటాలిక్)
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)


Click it and Unblock the Notifications








