కొత్త స్విఫ్ట్ డిజైర్ 2012 - పూర్తి ఫీచర్లు, సాంకేతిక వివరాలు

దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా నేడు మార్కెట్లోకి సరికొత్త కాంపాక్ట్ సెడాన్ "స్విఫ్ట్ డిజైర్ 2012"ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పాత స్విఫ్ట్‌ డిజైర్ సెడాన్‌కు కొత్త స్విఫ్ట్ డిజైర్ సెడాన్‌కు దాదాపు 150కు మార్పులు చేర్పులు చేశామని, పాత స్విఫ్ట్‌ డిజైర్‌తో పోల్చుకుంటే దీని ధర రూ.25,000 నుండి రూ.30,000 వరకూ తక్కువగా ఉంటుందని కంపెనీ వివరించింది.

ఈ కొత్త సెడాన్‌ను మారుతి సుజుకి తన మానేసర్ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పొడవాటి స్విఫ్ట్ డిజైర్ సెడాన్‌కు వెయిటింగ్ పీరియడ్ 3-4 నెలలుగా ఉంది. 2008లో విడుదలైన స్విఫ్ట్ డిజైర్ సెడాన్‌ ఇప్పటి వరకూ 3.2 యూనిట్లుగా పైగా అమ్ముడయ్యాయి. ఇది నాలుగు మీటర్ల కన్నా పొడవు ఉండటంతో దీనిపై కంపెనీ అధికంగా 10 ఎక్సైజ్ సుంఖాన్ని చెల్లించాల్సి వచ్చేంది.

కొత్త స్విఫ్ట్ డిజైర్ 2012 సెడాన్ ఫోటో గ్యాలరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి:

ఈ నేపథ్యంలో చిన్న కార్లపై లభిస్తున్న 10 శాతం ఎక్సైజ్ రాయితీని ఈ కొత్త మోడల్‌పై పొందేందుకు గానూ దీని పొడవు 3.99 మీర్లుగా ఉండేలా కంపెనీ జాగ్రత్తలు తీసుకుంది. ప్రస్తుత ప్రభుత్వ పాలసీ ప్రకారం, ఏదైనా కారు నాలుగు మీటర్ల పొడవు కన్నా తక్కువగా ఉండి, 1200సీసీ వరకూ ఇంజన్ సామర్థ్యం కలిగిన పెట్రోల్ కార్లు, 1500సీసీ వరకూ ఇంజన్ సామర్థ్యం కలిగిన డీజిల్ కార్లను చిన్న కార్లుగా పరిగణిస్తారు.

నాలుగు మీటర్ల కన్నా పొడవు ఉండే కార్లు, అదనంగా 22 శాతం ఎక్సైజ్ సుంఖాన్ని, అంటే సుమారు రూ.15,00 వరకూ అధనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాగా.. టొయోటా ఎతియోస్, టాటా ఇండిగో సిఎస్, మహీంద్రా వెరిటోలకు ధీటుగా ప్రవేశపెట్టిన ఈ బుజ్జి సెడాన్‌లో అనేక కొత్త ఫీచర్లను జోడించడం జరిగింది. కొత్త స్విఫ్ట్ డిజైర్ సెడాన్‌లో ఉండే విశిష్టమైన ఫీచర్లు, ప్రత్యేకతలు తదితర పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని ప్రత్యేకించి మా తెలుగు డ్రైవ్ స్పార్క్ పాఠకుల కోసం ప్రచురించడమైనది.

మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 1, 2012, 19:26 [IST]
English summary
The new DZire has about 150 new features when compared to the current model. As Drivespark had earlier reported, it is shorter than four metres in length and hence attracts lesser excise duty. This has helped Maruti Suzuki keep the Dzire's price low. This is quite contrary to the launch of the new Swift which was about Rs.23,000 more expensive than the previous version.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+