డీజిల్ కార్లపై అధనపు పన్నులు విధించడం సరికాదు..!!

మరికొద్ది రోజుల్లోనే (మార్చి నెలలో) యూనియన్ బడ్జెట్ 2012-13 విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే ఆటోమొబైల్ కంపెనీల గుండెల్లో గుబులు మొదలయ్యింది. ఈసారి బడ్జెట్ డీజిల్ ఇంధనం/కార్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్‌లో ఇప్పుడిప్పుడే డీజిల్ కార్ల వ్యాపారం జోరందుకుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో డీజిల్ కార్లపై అదనపు సుంకాలు వసూలు చేస్తే ఇటు ఆటో కంపెనీలు, అటు కస్టమర్లపై అధనపు భారం పడుతుంది.

కాగా.. డీజిల్ కార్లపై అదనపు పన్నులు వసూలు చేస్తే పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు మైఖేల్ బోన్‌హామ్ ఆందోళన వ్యక్తం చేశారు. డీజిల్ కార్లపై అధనపు సుంఖాలను విధించాలన్న ప్రభుత్వం ప్రతిపాదనలను ఆయన వ్యతిరేఖించారు. దీని గురించి బోన్‌హామ్ స్పందిస్తూ.. ఇప్పటికే అధిక వడ్డీ రేట్లతో సతమతవుతున్న పరిస్థితుల్లో డీజిల్ కార్లపై అదనపు పన్నులు వసూలు చేయడం సరికాదని, ఇది తిరోగామి చర్య అని అభిప్రాయ పడ్డారు. కొత్త పన్నులు విధించినట్లయితే, డీజిల్ కార్ల ధరలు రూ.80,000 వరకూ పెరగవచ్చని ఆయన అన్నారు.

డీజిల్ కార్లపై అదనపు సుంకాలను వసూలు చేయడానికి బదులు ప్రతి లీటరుపై 75 పైసలు చొప్పున పెంచినట్లయితే, అంతే ఆదాయాన్ని పొందవచ్చని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం పెట్రోల్ ధరలపై ప్రభుత్వం నియంత్రణలు ఎత్తివేయడం, ఫలితంగా చమురు కంపెనీలు తమ ఇష్టానుసారం ధరలను పెంచుతుండటంతో కొనుగోలుదారులు డీజిల్ కార్లపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఫలితంగా పెట్రోల్ ఇంధన వినియోగం తగ్గి డీజిల్ ఇంధన గణనీయంగా పెరిగింది. డీజిల్ ధరలపై నియంత్రణ ప్రస్తుతానికి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది.

డీజిల్ ఇంధనాన్ని ఇలానే వినియోగించుకుంటూ పోతే భవిష్యత్తులో డీజిల్ ఇంధన కొరత ఏర్పడుతుందనే ఉద్దేశ్యంతో డీజిల్ ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు గానూ ప్రభుత్వం డీజిల్ కార్లపై అదనపు సుంకాలను విధించాలని యోచిస్తోంది. ఇలా చేయడం వలన డీజిల్ కార్ల వినియోగం కాస్తయినా తగ్గి ఇంధన అవుతుందనేది ప్రభుత్వం యోచన. ఏదేమైనప్పటికీ.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వలన చివరిగా వినియోగదారుడి నెత్తిపైనే అధనపు భారం పడుతుండటం శోచనీయం..!

More from DriveSpark

Article Published On: Friday, February 17, 2012, 16:53 [IST]
English summary
The auto industry appears to have a similar opinion towards government plans to increase taxation of diesel vehicles. While Mahindra had earlier released a statement indicating its displeasure at the any plans to increase taxes on diesel vehicles, it is now the turn of Ford Motor India chief Michael Boneham to oppose taxes on diesel cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+