నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ ఐ10లో డీజిల్ వెర్షన్!

చిన్న కార్ ప్రియులకు నిజంగా ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. దేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా చవక రకం డీజిల్ కార్లను అందుబాటులో తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ డీజిల్ కారు హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌కు మరిన్ని డీజిల్ కార్లు అందుబాటులోకి రానున్నాయి.

హ్యుందాయ్ నుంచి అత్యంత పాపులర్ అయిన చిన్న కారు 'హ్యాందాయ్ ఐ10' ప్రస్తుతం పెట్రోల్ వేరియంట్లో లభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం, హ్యుందాయ్ ఐ10లో ఓ డీజిల్ వెర్షన్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తోంది. బిఏ అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చెందుతున్న నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ ఐ10 కోసం కంపెనీ రెండు అధునాతన డీజిల్ ఇంజన్లను అభివృద్ధి చేస్తోంది.

అందులో ఒకటి పెట్రోల్, మరొకటి డీజిల్ ఇంజన్ అని సమాచారం. 2013 వెర్షన్ హ్యుందాయ్ ఐ10లో 1.0 లీటర్ 3-సిలిండర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌ను అలాగే, 1.1 లీటర్ సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా డీజిల్ కార్లకు ఎక్కువగా డిమాండ్ ఉండే దేశాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ అధునాతన ఇంజన్లను తయారు చేస్తోంది.

ప్రస్తుతం హ్యుందాయ్ అందిస్తున్న డీజిల్ ఇంజన్లు 1.4 లీటర్, 1.6 లీటర్ సామర్థ్యాల నుంచి ప్రారంభమవుతున్నాయి. కాగా. కొత్తగా రానున్న 1.1 లీటర్ డీజిల్ ఇంజన్ హ్యుందాయ్ నుంచి రానున్న అతి చిన్న డీజిల్ ఇంజన్‌గా నిలువనుంది. అలాగే, 1.0 పెట్రోల్ ఇంజన్ కూడా అతి చిన్న ఇంజన్‌గా ఉండనుంది. ఈ ఇంజన్లు చిన్నవిగా ఉన్నప్పటికీ, మెరుపైన పెర్ఫామెన్స్‌ను కలిగి ఉండి, అధిక మైలేజ్‌ను ఆఫర్ చేయనున్నాయి.

హ్యుందాయ్ మోటార్స్ ఇప్పుడు ఈ రెండు వెర్షన్లను టెస్టింగ్ నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కాగానే ఇవి మార్కెట్లోకి వస్తాయి. 2012 చివరి నాటికి లేదా 2013 తొలి త్రైమాసికంలో డీజిల్ వెర్షన్ ఐ10 మనం మార్కెట్లో చూసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 1, 2012, 15:45 [IST]
English summary
India's second largest car maker Hyundai Motor is expected to bring diesel version next generation Hyundai i10. The company is now working on two new engines, which will be introduced in 2013 Hyundai i10 codenamed BA.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+