నిస్సాన్ మైక్రా, పెట్రోల్ వెర్షన్ సన్నీ ధరల పెంపు

Nissan Price Hike
నిస్సాన్ మోటార్ ఇండియా ప్రై లి అందిస్తున్న మైక్రా హ్యాచ్‌బ్యాక్, సన్నీ సెడాన్‌ల ధరలు కొండెక్కాయి. మైక్రాలో లభిస్తున్న పెట్రోల్, డీజిల్ వేరియంట్ల ధరలను అలాగే, సన్నీ పెట్రోల్ వేరియంట్ ధరలను 0.56 శాతం నుండి 2.09 శాతం మేర పెంచుతున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్త ధరలు జనవరి 20, 2012 నుండి అమలులోకి వస్తాయని నిస్సాన్ ప్రకటించింది.

మూడు వేరియంట్లలో లభ్యమవుతున్న పెట్రోల్ మైక్రా వెర్షన్ ధరలు రూ.3,000, రెండు వేరియంట్లలో లభ్యమవుతున్న డీజిల్ మైక్రా ధరలు రూ.12,000 చొప్పున పెరిగాయి. పెట్రోల్ వెర్షన్ సన్నీలో లభిస్తున్న మూడు వేరియంట్ల ధర రూ.5,000 మేర పెరిగాయి. పెట్రోల్ వెర్షన్ సన్నీను గడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో కంపెనీ విడుదల చేసింది.

అయితే, గడచిన డిసెంబర్ నెలలో విడుదలైన సన్నీ సెడాన్ డీజిల్ వేరియంట్లను మాత్రం కంపెనీ పెంచలేదు. నిస్సాన్ సన్నీ డీజిల్ రెండు వేరియంట్లలో (ఎక్స్‌ఎస్, ఎక్స్‌వి) లభ్యమవుతుంది. ఎక్స్ఎల్ వేరింట్ ధర రూ.7.98 లక్షలుగా ఉండగా, ఎక్స్‌వి వేరియంట్ ధర రూ.8.78 లక్షలుగా ఉంది (అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

పెరిగిన ఇన్‌పుట్ ధరలు, డాలర్‌తో పోల్చుకుంటే క్షీణిస్తున్న రూపాయి మారకపు విలువ తదితర అంశాల కారణంగా తమకు వేరే మార్గం లేక ధరలను పెంచాల్సి వస్తుందని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కిమినోబు టోకుయమా తెలిపారు. అయితే, వినియోగదారుల మనస్సును దృష్టిలో ఉంచుకొని మార్జినల్‌గానే ధరలను పెంచామని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Thursday, January 19, 2012, 16:53 [IST]
English summary
Nissan Motor India Pvt. Limited announced today that prices of its best selling Diesel and Petrol versions of Micra and September-launched Sunny Petrol will be increased by 0.56 per cent to 2.09 per cent from January 20, 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+