మార్చి నెల నుండి సన్నీ ఎగుమతులు ప్రారంభం
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా ఇటీవలే దేశీయ విపణిలోకి విడుదల చేసిన చీప్ అండ్ బెస్ట్ సెడాన్ 'నిస్సాన్ సన్నీ' ఎగుమతులకు ముహుర్తం ఖరారైంది. రానున్న మార్చి నెలాఖరు నాటికి సన్నీ సెడాన్‌ను ఎగుమతి చేయగలమని అంచనా వేస్తున్నామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కిమినోబు టోకుయమా తెలిపారు.
ఇప్పటికే తమ చిన్న కారు మైక్రాను అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నామని, ప్రారంభంలో భాగంగా, తొలుతగా నిస్సాన్ సన్నీను మిడిల్ ఈస్ట్ మార్కెట్లకు ఎగుమతి చేస్తామని ఆయన చెప్పారు. ఈ మేరకు డిమాండు అనుగుణంగా ఉత్పత్తిని అందించేకు చెన్నై ప్లాంటులో ఉత్పత్తి సమార్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం సాలీనా రెండు లక్షల యూనిట్లుగా ఉన్న చెన్నై ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని, మార్చి చివరి నాటికి నాలుగు లక్షల యూనిట్లకు పెంచేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం సన్నీ సెడాన్ కారు చెన్నైలోని ఓరగడం ప్లాంటులో నిస్సాన్ ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్లాంటులో నిస్సాన్ నుంచి మైక్రా తర్వాత ఉత్పత్తి అవుతున్న రెండవ కారు సన్నీ.


Click it and Unblock the Notifications









