రెనో డస్టర్ క్లోన్‌తో వస్తున్న నిస్సాన్ డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

By Ravi

మైక్రా హ్యాచ్‌బ్యాక్‌తో భారత్‌లో కార్ల వ్యాపారం ప్రారంభించిన జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని మరింత విస్తరించుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే హ్యాచ్‌బ్యాక్ (మైక్రా), సెడాన్ (సన్నీ), ఎమ్‌పివి (ఇవాలియా) ప్రీమియం సెడాన్ (టియానా), ప్రీమియం ఎస్‌యూవీ (ఎక్స్-ట్రైల్), స్పోర్ట్స్ కార్ (370జెడ్) విభాగాల్లో వాహనాలను అందిస్తున్న నిస్సాన్ ఇండియా, ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కూడా తన స్టాంప్ వేయాలని సన్నాహాలు చేస్తుంది.

ఈ నేపథ్యంలో, తమ ఫ్రెంచ్ భాగస్వామి రెనో ఇండియా తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టిన కాంపాక్ట్ ఎస్‌యూవీ డస్టర్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రీబ్యాడ్జ్‌డ్ వెర్షన్‌ను తయారు చేయాలని నిస్సాన్ మోటార్ ఇండియా నిర్ణయించింది. మైక్రా-పల్స్, సన్నీ-స్కాలా మాదిరిగానే ఈ నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా ఫీచర్ల పరంగా, టెక్నాలజీ పరంగా దాదాపు ఒకేవిధమైన మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే, డిజైన్ పరంగా మాత్రం కాస్తంత మార్పులు గమనించవచ్చు. అలాగే, ధర పరంగా గమనిస్తే.. రెనో డస్టర్ కన్నా నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాస్తంత తక్కువ ధరను కలిగి ఉండే అవకాశం ఉంది.

నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా తమ ఫ్రెంచ్ భాగస్వామి రెనో ఇండియా అందిస్తున్న డస్టర్ ఎస్‌యూవీ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది.

నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

రెనో డస్టర్ ఫ్లాట్‌ఫామ్‌పై వస్తున్న ఈ నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా ఫీచర్లు, టెక్నాలజీ పరంగా దాదాపు ఒకేవిధమైన మార్పులు ఉండి, డిజైన్, ధరల పరంగా కొద్దిపాటి మార్పులను కలిగి ఉండనుంది.

నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ప్రస్తుతం ఎన్‌హెచ్79 అనే కోడ్ నేమ్‌తో, నిస్సాన్-రెనో కంపెనీల మధ్య కుదిరిన క్రాస్ బ్యాడ్జింగ్ ఒప్పందంలో భాగంగా నిస్సాన్ మోటార్ ఇండియా ఈ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది.

నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఈ నిస్సాన్ ఎస్‌యూవీ రెనో డస్టర్ కన్నా కాస్తంత తక్కువగా ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం రెనో డస్టర్ ధరలు రూ. 8.19 లక్షల నుంచి రూ. 11.29 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి.

నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

వచ్చే ఏడాది చివరి నాటికి నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.


ప్రస్తుతం ఎన్‌హెచ్79 అనే కోడ్ నేమ్‌తో, నిస్సాన్-రెనో కంపెనీల మధ్య కుదిరిన క్రాస్ బ్యాడ్జింగ్ ఒప్పందంలో భాగంగా నిస్సాన్ మోటార్ ఇండియా ఈ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. ఇప్పటి వరకూ రెనో ఇండియా రెండు నిస్సాన్ ఉత్పత్తులను (మైక్రా, సన్నీ) రీబ్యాడ్జ్ చేసి (పల్స్, స్కాలా) మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు తొలిసారిగా రెనో డస్టర్ ఎస్‌యూవీని రీబ్యాడ్జ్ చేసి నిస్సాన్ దేశీయ విపణిలో ఈ ఎస్‌యూవీని విడుదల చేయనుంది. వచ్చే ఏడాది చివరి నాటికి నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.

రెనో డస్టర్ ఫ్లాట్‌ఫామ్‌పై వస్తున్న నిస్సాన్ ఎస్‌యూవీలో అందులో ఉపయోగించిన ఇంజన్లనే ఉపయోగించనున్నారు. పెట్రోల్ వెర్షన్ రెనో డస్టర్ 102 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 1.6లీటర్ ఇంజన్‌ను, డీజిల్ వెర్షన్ రెనో డస్టర్‌లో రెండు విభిన్న పవర్స్‌తో కూడిన (85పిఎస్, 110పిఎస్‌) 1.5 డిసిఐ ఇంజన్‌లను ఉపయోగించారు. ఈ నిస్సాన్ ఎస్‌యూవీ రెనో డస్టర్ కన్నా కాస్తంత తక్కువగా ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం రెనో డస్టర్ ధరలు రూ. 8.19 లక్షల నుంచి రూ. 11.29 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి.

ఎస్‌యూవీ సెగ్మెంట్లో ప్రస్తుతం నిస్సాన్ కేవలం ఎక్స్-ట్రైల్ ప్రీమియం ఎస్‌యూవీని మాత్రమే ఆఫర్ అందిస్తోంది. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీని సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తున్న కారణంగా దీని ధర కూడా అధికంగానే ఉంది. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ.22.6 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 30, 2012, 18:57 [IST]
English summary
As we reported earlier about Nissan's compact SUV based on its alliance partner Renault’s Duster platform, now company has officially confirmed that it will launch the Duster SUV under its own name and badge. Currently Nissan India is developing a compact SUV under the code: NH79.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+