ఇవాలియా ఎమ్‌పివిని మార్కెట్లో విడుదల చేసిన నిస్సాన్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా తమ తొలి ఎమ్‌పివి ఇవాలియాను నేడు లాంఛనంగా మార్కెట్లో విడుదల చేసింది. ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లు కలిగిన ఇవాలియా అత్యంత పోటీ ధరకే కంపెనీ ఆఫర్ చేస్తోంది. నిస్సాన్ ఇవాలియా ప్రస్తుతానికి డీజిల్ వేరియంట్‌లో మాత్రమే లభ్యం కానుంది. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ.8.49 లక్షలుగా ఉంది.

నిస్సాన్ ఇవాలియా 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3750 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 1900 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్) కలిగిన నిస్సాన్ ఇవాలియా లీటర్ డీజిల్‌కు సుమారు 20 కి.మీ. మైలేజీనిస్తుంది.


నిస్సాన్ ఇవాలియాలో ఆరుగురు ప్రయాణికులు (డ్రైవర్ కాకుండా) హాయిగా ప్రయాణించవచ్చు. వెనుక వరుసలలో ఉండే రెండు సీట్లను పూర్తిగా మడిచినట్లయితే 2900 లీటర్ల వరకూ బూట్ స్పేస్ లభిస్తుంది. ఇది నాలుగు వేరియంట్లలో (ఎక్స్ఈ, ఎక్స్ఈ ప్లస్, ఎక్స్ఎల్, ఎక్స్‌వి) లభ్యమవుతుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

* నిస్సాన్ ఇవాలియా ఎక్స్ఈ - రూ.8.49 లక్షలు
* నిస్సాన్ ఇవాలియా ఎక్స్ఈ ప్లస్ - రూ.8.92 లక్షలు
* నిస్సాన్ ఇవాలియా ఎక్స్ఎల్ - రూ.9.49 లక్షలు
* నిస్సాన్ ఇవాలియా ఎక్స్‌వి - రూ.9.99 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Tuesday, September 25, 2012, 15:33 [IST]
English summary
Nissan has launched the much awaited MPV from their end.The Evalia will be offered in four trims. Nissan has equipped the Evalia with a 1.5 liter dCi diesel engine. The engine is capable of churning out 84 bhp and 20.4 kgm of torque.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+