ఆటోమేటిక్ వెర్షన్ సన్నీను విడుదల చేయనున్న నిస్సాన్
ఇప్పటికే నిస్సాన్ సన్నీ ఆటోమేటిక్ సెడాన్‌ను కంపెనీ బెంగుళూరులో టెస్ట్ రన్ కూడా నిర్వహిస్తోంది. అయితే, ఆటోమేటిక్ వేరియంట్‌ను పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో విడుదల చేస్తుందా లేక డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో విడుదల చేస్తుందా అనే విషయం ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. వాస్తవానికి సన్నీలో డీజిల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ మోడల్ అమ్మకాలు జోరందుకున్నాయి. దీన్ని బట్టి చూస్తే డీజిల్ వేరియంట్లోనే ఆటోమేటిక్ వెర్షన్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కానీ ప్రస్తుత ట్రెండ్ ప్రకారం గమనిస్తే, దాదాపు అన్ని కార్ కంపెనీలు పెట్రోల్ వేరియంట్లోనే ఆటోమేటిక్ వెర్షన్‌ను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలుత పెట్రోల్ వేరియంట్లో సన్నీ సెడాన్ ఆటోమేటిక్ విడుదలయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి డీజిల్ వేరియంట్లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అమర్చడం కాస్తంత ఖర్చుతో కూడుకున్న పని, దీనివలన కారు రేటుగా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
అందుకే, దాదాపుగా అన్ని కంపెనీలు తక్కువ ధరలో ఆటోమేటిక్ వెర్షన్ కార్లను అందించేందుకు గానూ పెట్రోల్ వేరియంట్లను ఆశ్రయిస్తుంటారు. ఇప్పటికే హోండా అందిస్తున్న సిటీ సెడాన్‌లో ఓ ఆటోమేటిక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టగా, తాజాగా ఆటోమేటిక్ వెర్షన్ ఫియస్టాను ఫోర్డ్ విడుదల చేసింది. మ్యాన్యువల్ వెర్షన్ సన్నీతోనే అమ్మకాలు జోరుగా సాగుతుంటే, ఇందులో ఆటోమేటిక్ వెర్షన్ కూడా లభించినట్లయితే సన్నీ జోరుకు బ్రేకులు వేయటం కష్టం. మీరేమంటారు..?


Click it and Unblock the Notifications









