హ్యుందాయ్ ఐ10 పోటీగా నిస్సాన్ చవక మైక్రా
కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ నుంచి ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారు 'హ్యుందాయ్ ఐ10' త్వరలోనే సవతిపోరు రానుంది. ఈ బుజ్జి కారును టార్గెట్ చేస్తూ జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ ఓ కొత్త వేరియంట్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. నిస్సాన్ ఇండియా నుంచి లభిస్తున్న చిన్న కారు 'నిస్సాన్ మైక్రా'లో తక్కువ ధర కలిగిన వేరియంట్‌ను విడుదల చేయాలని నిస్సాన్ ఇండియా భావిస్తోంది.
ప్రస్తుతం పెట్రోల్ కార్ల అమ్మకాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో, వీటి అమ్మకాలను పెంచుకునేందుకు నిస్సాన్ మైక్రా పెట్రోల్ వేరియంట్‌లో కొద్దిపాటి ఫీచర్లను తగ్గించి, తక్కువ ధరకే హ్యుందాయ ఐ10కు ధీటుగా కంపెనీ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం నిస్సాన్ మైక్రా బేస్ వేరియంట్ ధర రూ.4.21 లక్షలుగా ఉంది. కాగా.. ఇందులో మార్కెట్లోకి రానున్న చీప్ వేరియంట్ ఈ ధర కన్నా సుమారు 50,000 తక్కువగా ఉండనుంది. అంటే సుమారు రూ.3.7 లక్షలకే కొత్త మైక్రా అందుబాటులోకి రానుందన్నమాట.
ప్రస్తుతం నిస్సాన్ మైక్రా పెట్రోల్ వెర్షన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో బేస్ వేరియంట్ అయిన ఎక్స్ఈ బాడీ కలర్డ్ బంపర్స్, టిల్ట్ స్టీరింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ వంటి ఫీచర్లతో లభ్యమవుతుంది. ధర తగ్గించేందుకు గానూ ఇందులో కొన్ని ఫీచర్లను తగ్గించి చవక వేరియంట్‌ను నిస్సాన్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఈ చవక వేరియంట్ మైక్రాలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, స్టీరింగ్ టిల్ట్-అడ్జస్ట్, డిజిటల్ క్లాక్, అడ్జస్టబల్ హెడ్‌రెస్ట్స్ వంటి ఫీచర్లు మిస్ కానున్నాయి. నిస్సాన్ మైక్రా మోడల్ అమ్మకాలను పెంచుకునేందుకు ఈ ప్రైస్ కట్ వెర్షన్ మైక్రా తోడ్పతుంది. ఈ సెగ్మెంట్లోని హ్యుందాయ్ ఐ10 (రూ. 3.65 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వంటి మోడళ్లకు ఇది ధీటుగా నిలబడనుంది.


Click it and Unblock the Notifications








