జులైలో 118 శాతం పెరిగి నిస్సాన్ ఇండియా అమ్మకాలు

ఇటీవలే ఇండియన్ కార్ మార్కెట్లోకి ప్రవేశించిన జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఎమ్ఐపిఎల్) దేశీయ విపణిలో ఏ నెలకు ఆ నెల ప్రోత్సాహకర వృద్ధిని కనబరుస్తూ మంచి ఫలితాలను తన ఖాతాలో వేసుకుంటుంది. గతేడాది జులై నెలతో పోల్చుకుంటే జులై 2012 నెలలో కంపెనీ అమ్మకాలు 1593 యూనిట్ల నుంచి 3481 యూనిట్లకు పెరిగాయి.

ఇదే సమయంలో కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ నిస్సాన్ సన్నీ అమ్మకాలు 2436 యూనిట్లుగా నమోదు కాగా, కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ నిస్సాన్ మైక్రా అమ్మకాలు 1028 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ రెండు మోడళ్లను కూడా కంపెనీ తన చెన్నై ప్లాంటులో ఉత్పత్తి చేస్తుంది. కాగా.. మిగిలిన అమ్మకాల్లో సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో నిస్సాన్ ఇండియా అందిస్తున్న లగ్జరీ సెడాన్ నిస్సాన్ టియానా, ఎస్‌యూవీ నిస్సాన్ ఎక్స్-ట్రైల్, స్పోర్ట్స్ కార్ నిస్సాన్ 370జెడ్‌లు ఉన్నాయి.

ఈ సందర్భంగా నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటె మేనేజింగ్ డైరెక్టర్ ఇషిడా టకాయుకి మాట్లాడుతూ.. సరైన ధరకే సరైన ఉత్పత్తులను అందించినప్పడు వినియోగదారులు వాటిని ఆదరిస్తారని, తమ విషయంలో కూడా అదే జరిగిందని అన్నారు. భారత మార్కెట్లో తమపై కస్టమర్లు చూపిస్తున్న అశేష ఆదరణ పట్ల సంతోషంగా ఉందని అన్నారు.

కాగా.. నిస్సాన్ ఇండియా భారత మార్కెట్ కోసం తయారు చేసిన బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌పివి) నిస్సాన్ ఇవాలియాను మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివి విడుదలతో ఈ అమ్మకాలు మరింత ఊపందుకునే ఆస్కారం ఉందని ఆయన అన్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 8, 2012, 18:11 [IST]
English summary
Nissan Motors continues to impress with its positive sales reports every month. The Japanese carmaker has posted a 118.5% increase in its July sales. The Sunny continues its impressive performance and is Nissan's best selling car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+