సిల్ఫీ సెడాన్‌ను ఇండియాకు తీసుకురానున్న నిస్సాన్
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ మోటార్ కార్పోరేషన్, భారత మార్కెట్లో మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌లో మొదటి ఉత్పత్తి మైక్రా చిన్న కారుతో భారత మార్కెట్లో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న నిస్సాన్ మోటార్ ఇండియా, ఆ తర్వాత ప్రవేశపెట్టిన సన్నీ సెడాన్‌తో కూడా మరో విజయాన్ని నమోదు చేసుకుంది.
నిస్సాన్ ఎంట్రీలెవల్ హ్యాచ్‌బ్యాక్, ఎంట్రీలెవల్ సెడాన్‌ను భారీ విజయాన్ని సాధించడంతో ఓ డి-సెగ్మెంట్ సెడాన్‌ను ఇండియన్లకు పరిచయం చేయాలని నిస్సాన్ మోటార్ ఇండియా భావిస్తోంది. ఇందులో భాగంగానే, నిస్సాన్ ఇటీవలే చైనాలో జరిగిన బీజింగ్ ఆటో షోలో ప్రపంచానికి పరిచయం చేసిన 'నిస్సాన్ సిల్ఫీ' కాన్సెప్ట్ సెడాన్‌ను దేశీయ విపణిలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది.
నిస్సాన్ సిల్ఫీ ప్రీమియం సెడాన్ సన్నీ, టియానా సెడాన్‌ల కలయికలా ఉంటుంది. ఈ సెగ్మెంట్లోని హోండా సివిక్, ఫోక్స్‌వ్యాగన్ జెట్టా, చెవర్లే క్రూజ్, హ్యుందాయ్ సొనాటా, టొయోటా కరోలా ఆల్టిస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. సన్నీ మాదిరిగా విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉండేలా, అలాగే టియానా మాదిరిగా విలాసవంతమైన ఫీచర్లు కలిగి ఉండేలా సిల్ఫీ సెడాన్‌కు నిస్సాన్ తీర్చిదిద్దింది.
నిస్సాన్ సిల్ఫీ సెడాన్‌లో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ నిస్సాన్ తాజాగా అభివృద్ధి చేసిన ఎక్స్‌ట్రానిక్ సివిటి ట్రాన్స్‌మిషన్‌తో సూట్ అవుతుంది, ఇది అధిక మైలేజ్‌ను అందించేందుకు సహకరిస్తుంది. 2014 నాటికి నిస్సాన్ సిల్ఫీ సెడాన్‌ను ఇండియన్ రోడ్లపై చూడొచ్చు. భారత మార్కెట్లో నిస్సాన్ సిల్ఫీ సెడాన్ ధర రూ.12 లక్షల నుండి రూ.17 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications









