జనవరి అమ్మకాల్లో మైక్రాను ఓవర్‌టేక్ చేసిన సన్నీ

అమ్మకాల పరంగా మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను సన్నీ సెడాన్ అధిగమించింది. ఈ నెలలో కేవలం 1855 యూనిట్ల మైక్రా కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మొత్తమ్మీద కంపెనీ గడచిన సంవత్సరం జనవరి నెలతో పోలిస్తే 178 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. జనవరి 2011లో కంపెనీ మొత్తం అమ్మకాలు 1855 యూనిట్లుగా ఉన్నాయి. ఆకర్షనీయమైన ధరకే పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతున్న సన్నీ సెడాన్ కారణంగా అమ్మకాలు జోరందుకున్నాయి.
ఈ రెండు మోడళ్లను నిస్సాన్ మోటార్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఉత్పత్తి చేస్తుంది. ఇవి కాకుండా.. టియానా ప్రీమియం సెడాన్, ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీ, 370జెడ్ స్పోర్ట్స్ కార్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకుని ఇక్కడ మార్కెట్లో విక్రయిస్తుంది. పూర్తిగా విదేశాల్లో తయారైన కార్లను దిగుమతి చేసుకని దేశీయ మార్కెట్లో విక్రయించడాన్ని సిబియూ విధానం అంటారు.


Click it and Unblock the Notifications








