ఇయాన్, ఆల్టో కార్లకు చెక్ పెట్టనున్న నిస్సాన్ చిన్న కారు

Nissan Qasana
భారత ఆటోమొబైల్ మార్కెట్లోని చిన్న కార్ సెగ్మెంట్లో విడుదలవుతున్న కొత్త కొత్త మోడళ్ల కారణం ఈ సెగ్మెంట్లో పోటీ గణనీయంగా పెరుగుతోంది. ఒక కంపెనీను మించి మరొక కంపెనీ తమ ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారు ఆల్టోకు చెక్ పెట్టేందుకు హ్యుందాయ్ తమ చిన్న కారు ఇయాన్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

కాగా.. తాజాగా ఇయాన్, ఆల్టో మోడళ్ల జోరుకు చెక్ పెట్టేందుకు గానూ ఓ చిన్న కారును విడుదల చేసేందుకు జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్ కసరత్తులు చేస్తోంది. రూ.3 లక్షలకు దిగువన ఉండేలా ఓ చిన్న కారును కంపెనీ అభివృద్ధి చేస్తోంది. తక్కువ ధర కలిగిన కార్ విభాగంలో ప్రవేశించాలని కంపెనీ భావిస్తోందని నిస్సాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆండీ పాల్మర్ మీడియాతో అన్నారు.

ప్రస్తుతం నిస్సాన్ అందిస్తున్న చిన్న కారు మైక్రాకు దిగువన కంపెనీ మరో చిన్న కారును ప్రవేశపెట్టనుంది. చెన్నైలోని నిస్సాన్-రీనాల్ట్ ప్లాంటులో మైక్రా హ్యాచ్‌బ్యాక్, సన్నీ సెడాన్ కార్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంటుకు మరింత చౌక కార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని, ఆ దిశగా కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని పాల్మర్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, January 19, 2012, 16:33 [IST]
English summary
The small car scene in India is about to get hotter with reports about Nissan Motors planning to launch an affordable small car that will be priced under Rs.23 lakhs. This is the first clear attempt by Nissan to counter other low priced small cars such as the Hyundai Eon and the Maruti Suzuki Alto.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+