అనుకున్నదాని కన్నా ముందే సన్నీ ఎగుమతులు ప్రారంభం
తొలి షిప్‌మెంట్‌లో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీన 3452 యూనిట్ల సన్నీ సెడాన్ కార్లను పశ్చిమ ఆశియాకు ఎగుమతి చేసింది. ఎగుమతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో 100 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే కంపెనీ తమ చిన్న కారు మైక్రాను అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి కంపెనీ అంచనా ప్రకారం మార్చి నెలాఖరు నాటికి నిస్సాన్ సన్నీ ఎగుమతులు ప్రారంభం కావల్సి ఉండగా, ఫిబ్రవరి నెల ఆరంభంలో షిప్‌మెంట్‌ను ప్రారంభించడం విశేషం.
ప్రస్తుతం చెన్నై ప్లాంటులో ఏటా రెండు లక్షల యూనిట్ల కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ ప్లాంటు నుండి 85,000 కార్లను నిస్సాన్ ఎగుమతి చేసింది. ఒక్క జనవరిలో 14,403 కార్లను నిస్సాన్ ఎగుమతి చేసింది. నిస్సాన్ ఇండియాకు ఒక్క నెలలో ఇంత అధిక సంఖ్యలో ఎగుమతులు నమోదు కావడం ఇదే మొదటిసారి.


Click it and Unblock the Notifications









