సిటీ, వెంటో సెడాన్‌లను ఓవర్‌టేక్ చేసిన నిస్సాన్ సన్నీ
గడచిన మార్చి నెలలో నిస్సాన్ 4,151 సన్నీ కార్లను విక్రయించి ఈ సెగ్మెంట్లో ప్రధమ స్థానాన్ని చేజిక్కించుకుంది. ఇదే సమయంలో హోండా 3,920 సిటీ కార్లను, ఫోక్స్‌వ్యాగన్ 3,908 వెంటో కార్లను విక్రయించింది. హోండా సిటీ ఇప్పటికే ఫోక్స్‌వ్యాగన్ వెంటోతో సమీప పోటీని ఎదుర్కుంటుంటే తాజాగా వచ్చిన నిస్సాన్ సన్నీ మరో పెద్ద పోటీదారుగా నిలిచింది.
తొలుత పెట్రోల్ వేరియంట్లో మాత్రమే సన్నీ లభిస్తున్నప్పుడు ఈ మోడల్ అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగాయి. అయితే, ఇందులో డీజిల్ వేరియంట్ విడుదలైన తర్వాత నెమ్మదిగా అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. విశాలమైన ఇంటీరియర్ స్పేస్, సౌకర్యవంతమైన ఫీచర్లతో అత్యంత ఆకర్షనీయమైన ధరకే సన్నీ అందుబాటులో ఉండటం కూడా ఈ మోడల్ అమ్మకాలు పెరగటానికి మరొక కారణంగా చెప్పుకోవచ్చు.
కాగా.. గడచిన మార్చి నెలలో నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మొత్తం 5,880 కార్లను విక్రయించింది. గడచిన సంవత్సరం మార్చి నెలతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు అధికం. మార్చి 2011లో నిస్సాన్ కేవలం 2,101 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇప్పటి వరకూ నిస్సాన్ ఇండియా అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసుకున్నది మార్చి 2012 నెలలోనే.


Click it and Unblock the Notifications









