ఇన్ఫినిటీ లగ్జరీ కార్లను ఇండియాకు తీసుకురానున్న నిస్సాన్

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్, భారత మార్కెట్లోని లగ్జరీ కార్ విభాగంపై కన్నేసింది. ప్రస్తుతం ఇండియాలో లగ్జరీ కార్ల వ్యాపారం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈ సెగ్మెంట్లోని అవకాశాలను దక్కించుకునేందుకు నిస్సాన్ ఇండియా, దేశీయ విపణిలో ఓ లగ్జరీ కార్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. నిస్సాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన 'ఇన్ఫినిటీ' లగ్జరీ కార్లను కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేయనుంది.

ఇప్పటికే టొయోటా తమ లగ్జరీ కార్ బ్రాండ్ 'లెక్సస్'ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్) రూట్లో ఇన్ఫినిటీ కార్లను ఇండియాకు తీసుకురావాలని భావించిన నిస్సాన్, ప్రస్తుతం ఈ కార్లను ఇండియాలోనే అసెంబ్లింగ్ చేయాలని యోచిస్తోంది. వీటిని దిగుమతి చేసుకుని విక్రయించడం కన్నా ఇక్కడే అసెంబ్లింగ్ చేసినట్లయితే వీటి ధర కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఇన్ఫినిటీ కార్ బ్రాండ్ లెక్సస్‌కు ధీటుగా నిలువనుంది. అలాగే, ప్రస్తుతం లగ్జరీ కార్ మార్కెట్‌లో అగ్రస్థానాలను ఆక్రమించిన బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. వాస్తవానికి ఇతర ధనిక దేశాలతో పోల్చి భారత లగ్జరీ కార్ మార్కెట్ పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ ఇది ఏడాదికేదాడి రెండితలు పెరగుతూ వస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 6, 2012, 16:00 [IST]
English summary
Japanese automobile major Nissan Motor Company will bring its ‘Infiniti' range of super-luxury cars to India soon. "The market for luxury in India is growing and the company is looking at ways to enter. Infiniti is our global brand and our intention is to cover the world, including India," Andy Palmer, V-P at Nissan Motor Co, said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+