చీప్ కార్ బ్రాండ్‌ను ఇండియాకు తీసుకురానున్న నిస్సాన్!
ముఖ్యంగా చవక కార్లకు ఎక్కువ డిమాండ్ ఉన్న ఇండియా వంటి మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ బ్రాండ్‌ను తిరిగి మార్కెట్లో అంశాన్ని పరిశీలిస్తోంది నీక్కీ తెలిపింది. రీనాల్ట్ భాగస్వామ్యంతో నిస్సాన్ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రీనాల్ట్-నిస్సాన్ జాయింట్ వెంచర్ ప్రపంచలో కెల్లా 3వ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా అవతరించింది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతినెలా 3 లక్షల డ్యాట్సన్ కార్లను విక్రయించాలని నిస్సాన్ భావిస్తోంది. టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి భారతీయ కంపెనీలు అందిస్తున్న ఎంట్రీలెవల్ కార్లకు డ్యాట్సన్ బ్రాండ్ కార్లు గట్టి పోటీగా నిలువనున్నాయి. నిస్సాన్ నుండి చవక కార్లను తయారు చేయడం కన్నా చవక కార్ బ్రాండ్‌నే ప్రవేశపెట్టడం ఉత్తమమని నిస్సాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications









