అద్భుతాలు చేస్తున్న నిస్సాన్ వండర్ కార్స్ సన్నీ, మైక్రా

జపాన్ ఆటోదిగ్గజం నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఎమ్ఐపిఎల్) దేశీయ మార్కెట్లో అందిస్తున్న చీప్ అండ్ బెస్ట్ సెడాన్ సన్నీ ఎంట్రీ లెవల్ సెడాన్ సెగ్మెంట్లో దూసుకుపోతుంది. ఆకర్షనీయమైన ధరలో, అత్యాధునిక ఫీచర్లతో లభిస్తున్న సన్నీ సెడాన్‌ అమ్మకాల పరంగా మార్కెట్లో అదరహో అనిపిస్తోంది. గడచిన నెలలో కేవలం 3,130 సన్నీ కార్లు అమ్ముడయ్యాయంటేనే ఈ మోడల్‌కు మార్కెట్లో ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది.

అలాగే, నిస్సాన్ చిన్న కారు మైక్రాకు కూడా మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తుంది. గడచిన ఫిబ్రవరి నెలలో 2,198 యూనిట్ల మైక్రా కార్లు అమ్ముడయ్యాయి. మొత్తమ్మీద ఫిబ్రవరి 2012 నెలలో నిస్సాన్ ఇండియా 5,371 కార్లను విక్రయించి, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే, రెండు రెట్ల వృద్ధిని నమోదు చేసుకుంది. నిస్సాన్ ఇండియాకు భారత మార్కెట్లో ఇదే అత్యధిక నెలవారీ విక్రయాలు. ఫిబ్రవరి 2011లో కేవలం 2,081 కార్లను మాత్రమే నిస్సాన్ విక్రయించిది.

"భారత్‌లో నిస్సాన్ అత్యధిక నెలవారీ విక్రయాలను నమోదు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. భారత వినియోగదారుల్లో నిస్సాన్ కార్లపై పెరుగుతున్న వృద్ధిని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయ"ని నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కిమినోబు టోకుయమా తెలిపారు.

More from DriveSpark

Article Published On: Monday, March 5, 2012, 12:36 [IST]
English summary
Nissan Motor India Private Ltd has recorded its best ever sales performance in a month after selling 5,371 vehicles in February 2012. The Japanese carmaker has said its February sales had in fact jumped up by a massive 158 per cent. The main contributor to this success is the Sunny sedan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+