ప్రస్తుతానికి డీజిల్ ధర పెంపు లేదు: ఎస్ జైపాల్ రెడ్డి

అలాగే వీటి ధరల పరిస్థితిని సమీక్షించేందుకు నిర్వహించాల్సిన సాధికార మంత్రుల బృంద సమావేశం తేది కూడా ఇంకా ఖరారు కాలేదని కేంద్ర చమురుశాఖ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సబ్సిడీ ధరలకే డీజిల్, ఎల్‌పిజి, కిరోసిన్ ఇంధనాలను విక్రయిస్తున్న కారణంగా, ప్రభుత్వ అధీనంలో ఉన్న ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు రూ.475 కోట్ల మేర నష్టాలను చవిచూస్తున్నాయి.
ఒకరకంగా ఈ భారం మొత్తం కూడా ప్రభుత్వాన్నే భరించాల్సి ఉంటుంది. చమురు కంపెనీలు విక్రయిస్తున్న ప్రతి లీటరు డీజిల్ రూ.14.09 చొప్పున నష్టం వాటిళ్లుతోంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఐఓసి, హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్ ప్రభుత్వ చమురు కంపెనీలు ఉమ్మడిగా రూ.1,38,541 కోట్ల రాబడిని కోల్పోయాయి. డీజిల్ ద్వంద్వ ధరల విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందనే వాదనకు కూడా జైపాల్ రెడ్డి తెర వేశారు. డీజిల్‌కు ద్వంద్వ ధరల విధానాన్ని పరిశీలించడం లేదని ఒక ప్రశ్నకు సమధానంగా ఆయన తెలిపారు. అయితే, డీజిల్ కార్లపై రూ.80,000 ఏకమొత్తం పన్ను విధించాలన్న ప్రభుత్వ ప్రతిపాదన ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో వుందని ఆయన తెలియజేశారు.
డీజిల్ కార్లపై అదనపు సుంకం వద్దు మహాప్రభో.....!!
డీజిల్ వినియోగాన్ని తగ్గించాలనే నెపంతో డీజిల్ కార్లపై భారీ సుంకాలను వసూలు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలకు సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. డీజిల్ కార్లపై అదనంగా పన్నులు విధిస్తే భారత వాహన పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుందని, ఇది అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని భారీ పరిశ్రమల విభాగం (డిహెచ్‌ఐ) వ్యాఖ్యానించింది.
ఈ విషయానికి సంబంధించి ఓ నివేదికను వచ్చే వారంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించనున్నామని డిహెచ్ఐ తెలిపింది. ఈ ప్రతిపాదనను ఇటు ఆటో కంపెనీలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. డీజిల్ కార్లపై సుంకాలను పెంచడానికి బదులు డీజిల్ ధరను పెంచడమే సమంజసమని అమెరికన్ కార్ మేకర్ ఫోర్డ్ ఇండియా పేర్కొంది.


Click it and Unblock the Notifications








